డంపింగ్‌ యార్డును రద్దు చేయకుంటే హుజూరాబాద్‌ అష్టదిగ్బంధనం.. రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక…

bahubalamtv Reporter
bahubalamtv.in

డంపింగ్‌ యార్డును రద్దు చేయకుంటే హుజూరాబాద్‌ అష్టదిగ్బంధనం.. రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక…

బాహు బలంన్యూస్ హుజూరాబాద్‌ ఏప్రిల్ 24 : హుజూరాబాద్‌ పట్టణ సమీపంలోని సిర్సపల్లి సరిహద్దులో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా చేపట్టిన డంపింగ్‌ యార్డు ప్రాజెక్టును తక్షణమే రద్దు చేయాలని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం సాయంత్రం హుజూరాబాద్‌ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్ చేపట్టిన నిరసన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి
గత నెల రోజులుగా అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు చేస్తున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని ఆయన కోరారు. గత 33 రోజులుగా నిరసనలు కొనసాగుతున్నా అధికారుల్లో చలనం లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా డంపింగ్‌ యార్డు పనులను నిలిపివేస్తూ అధికారిక ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
" మే" మొదటి వారంలో భారీ ఉద్యమం
ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పోలాడి రామారావు హెచ్చరించారు. "వచ్చే మే నెల మొదటి వారంలో 10 వేల మందితో సమీప గ్రామాల ప్రజలను సమీకరించి హుజూరాబాద్‌ ప్రాంతాన్ని చతుర్ముఖ వ్యూహంతో అష్టదిగ్బంధనం చేస్తాం. అవసరమైతే ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తాం" అని ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు రైతులుమరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజూరాబాద్‌ ఏప్రిల్ 24 : హుజూరాబాద్‌ పట్టణ సమీపంలోని సిర్సపల్లి సరిహద్దులో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా చేపట్టిన డంపింగ్‌ యార్డు ప్రాజెక్టును తక్షణమే రద్దు చేయాలని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం సాయంత్రం హుజూరాబాద్‌ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్ చేపట్టిన నిరసన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి
గత నెల రోజులుగా అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు చేస్తున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని ఆయన కోరారు. గత 33 రోజులుగా నిరసనలు కొనసాగుతున్నా అధికారుల్లో చలనం లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా డంపింగ్‌ యార్డు పనులను నిలిపివేస్తూ అధికారిక ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
” మే” మొదటి వారంలో భారీ ఉద్యమం
ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పోలాడి రామారావు హెచ్చరించారు. “వచ్చే మే నెల మొదటి వారంలో 10 వేల మందితో సమీప గ్రామాల ప్రజలను సమీకరించి హుజూరాబాద్‌ ప్రాంతాన్ని చతుర్ముఖ వ్యూహంతో అష్టదిగ్బంధనం చేస్తాం. అవసరమైతే ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తాం” అని ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు రైతులుమరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !