అంగరంగ వైభవంగా… హైదరాబాదులో హుజురాబాద్ ఎన్నారై వివాహ రిసెప్షన్ రిసెప్షన్ కు హాజరైన ప్రముఖులు.

bahubalamtv Reporter
bahubalamtv.in

అంగరంగ వైభవంగా… హైదరాబాదులో హుజురాబాద్ ఎన్నారై వివాహ రిసెప్షన్ రిసెప్షన్ కు హాజరైన ప్రముఖులు.

బాహు బలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్,ఫిబ్రవరి 26 : హుజురాబాద్ పట్టణానికి చెందిన ఎన్ఆర్ఐ పోతిరెడ్డి రాహుల్ వివాహ రిసెప్షన్ హైదరాబాదు బాచుపల్లి లోని కే జీ ఆర్ కన్వెన్షన్ లో మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. రాహుల్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా స్థిరపడ్డారు. రాహుల్ తండ్రి పోతిరెడ్డి శ్రీనివాస్ హుజురాబాద్ పట్టణానికి చెందిన పూర్వ విద్యార్థి కావడంతో పాటు, హైదరాబాదు పటాన్చెరు లోని ప్రఖ్యాత తోషిబా టీ అండ్ డి సిస్టమ్స్ కంపెనీ సీనియర్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు.పోతిరెడ్డి శ్రీనివాస్ మిత్రులైన 1981-1982 హుజురాబాద్ శిశు మందిర్ ఏడవ తరగతి బ్యాచ్, 1982-1985 ప్రభుత్వ హైస్కూల్, 1985-88 హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ బ్యాచ్, 1988-92 వరంగల్ కిట్స్ ఇంజనీరింగ్ పూర్వ విద్యార్థులు వివాహ రిసెప్షన్ కు హాజరయ్యారు. పూర్వ విద్యార్థుల సమావేశం లా వివాహ రిసెప్షన్ తలపించింది. హుజురాబాద్ హనుమకొండ, కరీంనగర్, హైదరాబాద్ పట్టణాల నుండి శ్రీనివాస్ మిత్రులు శ్రేయోభిలాషులు రిసెప్షన్కు హాజరయ్యారు. వధూవరులు రాహుల్ రోహిణి దంపతులను అభినందించి ఆశీర్వదించారు. పోతిరెడ్డి శ్రీనివాస్ ఆహ్వానం మేరకు పలువురు తోషిబా కంపెనీ ప్రతినిధులు జపాన్ నుండి ప్రత్యేకంగా హాజరై రిసెప్షన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఫిన్లాండ్ నుండి వచ్చిన యువజంట అందరిని ఆకట్టుకున్నారు. పలువురు విదేశీయులు, పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు కూడా రిసెప్షన్కు హాజరయ్యారు. రిసెప్షన్లో పూర్వ విద్యార్థుల సందడి కనిపించింది. చాలా రోజుల తర్వాత కలుసుకున్న మిత్రులు ఫోటోలు సెల్ఫీలు తీసుకొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. వివాహ రిసెప్షన్ లో ఐఏఎస్ అధికారి కోరెం అశోక్ రెడ్డి, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, వరంగల్ కిట్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె అశోక్ రెడ్డి, హైదరాబాద్ పోస్టల్ శాఖ ఉన్నతాధికారి అక్కు శ్రీనివాస్, ఇన్ఫార్ సాఫ్ట్వేర్ కంపెనీ సీఈవో గంగిశెట్టి రాఘవేందర్, రిటైర్డ్ డిప్యూటీ డిఇఓ ఆలేటి మదన్మోహన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !