రాజకీయాలకు వన్నెతెచ్చినది అటల్ బిహారీ వాజపేయి…. ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.

బాహు బలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్
రాజకీయాలలో నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక నాయకుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ అని ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు.
బుధవారం ఇక్కడ ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జరిగిన భారత రత్న వాజ్ పాయ్
శతజయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ పార్లమెంటులో ఒక్క ఓటు తేడాతో ప్రధాని పదవి వదులుకొని నైతిక విలువలకు మించింది లేదని ఆయన నిరూపించారని చెప్పారు.రాజనీతికి నిలువుటద్దం, రాజీ ఎరుగని దేశభక్తుడు, నిజాయితీ, నిబద్ధత గల అజాత శత్రువుగా, స్టేట్స్ మెన్ గా,పార్టీలకతీతంగా కమ్యూనిస్టులతీ సహా వాజపేయి ని ఆదర్శ రాజకీయ నాయకుడిగా కొనియాడే వారని,భారత జాతి గర్వించదగ్గ మహా నేత రాజకీయ భీష్మ పితామహుడు,అటల్ బిహారీ వాజపేయి అని, ప్రతిపక్ష నేతగా,ప్రధానిగా,అత్యున్నత విలువలను ఆయన రాజకీయాలలో పాదుకొల్పారని రామారావు చెప్పారు.
పది సార్లు లోక్ సభ సభ్యునిగా, రెండు సార్లు రాజ్య సభ సభ్యునిగా ఉన్న వాజపేయి నేడు ఒక రాజకీయ విశ్వవిద్యాలయం అని,రహదారుల అనుసంధానం వల్లనే
గ్రామీణ అభివృద్ధి సాధ్యమని భావించి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పేరుతో ప్రతి ఊరుకు రోడ్లు వేసిన ఘనత
ఆయనకే దక్కుతుందన్నారు.
వాజపేయి దూర దృష్టి వల్లే నేడు మనం ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ,అభివృద్ది పథంలో దూసుకు వెళ్లగలుగుతున్నామని కొనియాడారు.
టెలికాం, టీవీ, ఇంటర్నెట్,విద్యుత్, గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు, పోర్టులు, నేషనల్ హైవేస్, వ్యవసాయ, ఐటీ పారిశ్రామిక , విద్య,వైద్య రంగాల్లో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి ఆయన వేసిన బాటలే కారణం అన్నారు.
శత్రుదేశాలను సైతం మిత్ర దేశాలుగా మలుచుకున్న
వాజ్ పాయ్ ని దేశ యువత ఆదర్శంగా తీసుకోవాలని అదే మనం వాజపేయికి ఇచ్చిన ఘన నివాళి అని, నేటి యువతరం ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని పోలాడి రామారావు అన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !