అతనిప్పుడు విప్లవిస్తున్న జనసంద్రంలో…

అతనిప్పుడు విప్లవిస్తున్న జనసంద్రంలో…

అతనిప్పుడు విప్లవిస్తున్న జనసంద్రంలో...
అతడు
మార్చూరీలో లేడు
అనాటమీ క్లాసులో తన దేహాన్ని విప్పి చూపిస్తూ పాఠం చెబుతూ వుంటాడు
అక్కడ అతణ్ణి కలుసుకోవచ్చు

అతడు ఇప్పుడు మార్చూరీలో
విద్యార్థులంతా వెళ్లి పోయాక
గాంధీ ఆసుపత్రి లైబ్రరీలో
మార్క్సును మళ్లీ మళ్లీ చదువుతూ
అంబేద్కర్ తో చర్చిస్తూ
చేతులను కాళ్లను చేసి నర్తిస్తూ వుంటాడు
మీరక్కడ అతడి అద్భుత కళా సృష్టిని చూడవచ్చు

అంతా ఆదమరిచి నిద్రపోతున్న వేళ
రహస్య సమావేశంలో విప్లవ స్వాప్నికులతో
సంభాషిస్తూ వుంటాడు
తన కబీరుతో కలిసి పాతబస్తీ రోడ్ల మీద
కీమా బిర్యానీ తిని
ఇరానీ చాయ తాగుతూ వుంటాడు
మీరతణ్ణి అక్కడ కలవొచ్చేమో!

అతడిప్పుడు
వసంత కొంగు ముడిని ముద్దాడుతూ
రమణీయమైన ప్రేమ కావ్యం రాస్తూ వుంటాడు
ఎండాకాల వడగాలులూ
శీతాకాలపు చలిగాలులూ
ఇక తననేమీ చేయలేవని ఈలవేస్తూ ఆడుతూ వుంటాడు
ఢిల్లీ కాలుష్యాన్ని తరిమే ఉపాయం కనిపెడుతూ
జంతర్మంతర్ అంతరంగాన్ని అనువదిస్తూ వుంటాడు
మీకు అతడు అక్కడ నిశ్చయంగా కనిపిస్తాడు

తను చివరిచూపు నోచుకోలేక పోయిన తల్లిని తప్పకుండా కలుసుకొని
అమ్మ వొడిలో పడుకొని బావురుమని ఏడుస్తూ వుంటాడు
వొంకలు తిరిగిన అతడి కాళ్లను నిమిరుతూ ఆ తల్లి అతణ్ణి ఓదారుస్తూ వుంటుంది
అతణ్ణి మళ్లీ పిల్లాడిలా చేసి
ఎర్రని మిఠాయి తినిపించడానికి గోదావరి వొడ్టుకు తీసుకు పోయింది
మీకు గోదావరి జిల్లాలో అతడు దొరకచ్చు, వెళ్లండి

దగ్ధమవుతున్న అమరుల చితి మంటలను చూస్తూ ఇప్పుడు దుఃఖ పడుతూ విలపిస్తూ వున్నాడు
ఆదిమ యుద్దంలో వొరిగిన వీరుడి చేతి తుపాకిని పట్టుకొని
గెరిల్లా తంత్ర రచనకు మెరుగులు దిద్దుతూ వున్నాడు
నిజానికి అతడు గాంధీ ఆసుపత్రిలో లేడు
విప్లవిస్తున్న జనసంద్రంలో అతడున్నాడు
మీకు అక్కడ తప్పకుండా అతడు కలుస్తాడు

అతడిప్పుడు
వర్గకుల సమరాన్ని తీవ్రంచేసే పనిలో
దేశమంతా సంచరిస్తున్నాడు
అతడికిప్పుడు కోటికోటి పాదాలు మొలిచాయి
కోట్లాది బిగించిన పిడికిళ్లు వున్నాయి
అతడిప్పుడు నిజంగానే మార్చూరీలో నిర్జీవిగా లేడు
అతడు అత్యున్నత చేతనా కేతనమై ఎగురుతున్నాడు
తప్పకుండా మీకతడు ఆ జెండాను చేతికిస్తూ చిర్నవు చిందిస్తూ వున్నాడు
వెళ్లండి. వెళ్లి కరచాలనం చేసి
గుండెకు అద్దుకోండి

- విసికె శ్రీనివాస్
(విప్లవ స్వాప్నికుడు సాయిబాబకు ప్రేమతో...)

Share ePaper Clip

Preparing image...

అతనిప్పుడు విప్లవిస్తున్న జనసంద్రంలో…
************************************* అతడు
మార్చూరీలో లేడు
అనాటమీ క్లాసులో తన దేహాన్ని విప్పి చూపిస్తూ పాఠం చెబుతూ వుంటాడు
అక్కడ అతణ్ణి కలుసుకోవచ్చు

అతడు ఇప్పుడు మార్చూరీలో
విద్యార్థులంతా వెళ్లి పోయాక
గాంధీ ఆసుపత్రి లైబ్రరీలో
మార్క్సును మళ్లీ మళ్లీ చదువుతూ
అంబేద్కర్ తో చర్చిస్తూ
చేతులను కాళ్లను చేసి నర్తిస్తూ వుంటాడు
మీరక్కడ అతడి అద్భుత కళా సృష్టిని చూడవచ్చు

అంతా ఆదమరిచి నిద్రపోతున్న వేళ
రహస్య సమావేశంలో విప్లవ స్వాప్నికులతో
సంభాషిస్తూ వుంటాడు
తన కబీరుతో కలిసి పాతబస్తీ రోడ్ల మీద
కీమా బిర్యానీ తిని
ఇరానీ చాయ తాగుతూ వుంటాడు
మీరతణ్ణి అక్కడ కలవొచ్చేమో!

అతడిప్పుడు
వసంత కొంగు ముడిని ముద్దాడుతూ
రమణీయమైన ప్రేమ కావ్యం రాస్తూ వుంటాడు
ఎండాకాల వడగాలులూ
శీతాకాలపు చలిగాలులూ
ఇక తననేమీ చేయలేవని ఈలవేస్తూ ఆడుతూ వుంటాడు
ఢిల్లీ కాలుష్యాన్ని తరిమే ఉపాయం కనిపెడుతూ
జంతర్మంతర్ అంతరంగాన్ని అనువదిస్తూ వుంటాడు
మీకు అతడు అక్కడ నిశ్చయంగా కనిపిస్తాడు

తను చివరిచూపు నోచుకోలేక పోయిన తల్లిని తప్పకుండా కలుసుకొని
అమ్మ వొడిలో పడుకొని బావురుమని ఏడుస్తూ వుంటాడు
వొంకలు తిరిగిన అతడి కాళ్లను నిమిరుతూ ఆ తల్లి అతణ్ణి ఓదారుస్తూ వుంటుంది
అతణ్ణి మళ్లీ పిల్లాడిలా చేసి
ఎర్రని మిఠాయి తినిపించడానికి గోదావరి వొడ్టుకు తీసుకు పోయింది
మీకు గోదావరి జిల్లాలో అతడు దొరకచ్చు, వెళ్లండి

దగ్ధమవుతున్న అమరుల చితి మంటలను చూస్తూ ఇప్పుడు దుఃఖ పడుతూ విలపిస్తూ వున్నాడు
ఆదిమ యుద్దంలో వొరిగిన వీరుడి చేతి తుపాకిని పట్టుకొని
గెరిల్లా తంత్ర రచనకు మెరుగులు దిద్దుతూ వున్నాడు
నిజానికి అతడు గాంధీ ఆసుపత్రిలో లేడు
విప్లవిస్తున్న జనసంద్రంలో అతడున్నాడు
మీకు అక్కడ తప్పకుండా అతడు కలుస్తాడు

అతడిప్పుడు
వర్గకుల సమరాన్ని తీవ్రంచేసే పనిలో
దేశమంతా సంచరిస్తున్నాడు
అతడికిప్పుడు కోటికోటి పాదాలు మొలిచాయి
కోట్లాది బిగించిన పిడికిళ్లు వున్నాయి
అతడిప్పుడు నిజంగానే మార్చూరీలో నిర్జీవిగా లేడు
అతడు అత్యున్నత చేతనా కేతనమై ఎగురుతున్నాడు
తప్పకుండా మీకతడు ఆ జెండాను చేతికిస్తూ చిర్నవు చిందిస్తూ వున్నాడు
వెళ్లండి. వెళ్లి కరచాలనం చేసి
గుండెకు అద్దుకోండి

– విసికె శ్రీనివాస్
(విప్లవ స్వాప్నికుడు సాయిబాబకు ప్రేమతో…)

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !