సారంపల్లి మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం: ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఘనంగా నివాళులర్పించిన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు

bahubalamtv Reporter
bahubalamtv.in

సారంపల్లి మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం: ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఘనంగా నివాళులర్పించిన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు

బాహు బలంన్యూస్ హైదరాబాద్, సెప్టెంబర్ 07 :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతాంగ, వ్యవసాయ శ్రామిక వర్గాల ఆత్మబంధువు, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు, సీపీఎం అగ్రనేత దివంగత కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి సమాజానికి చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఉద్ఘాటించారు. సోమవారం హైదరాబాద్‌లో ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య (ఓసీ జేఏసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభకు ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు మాట్లాడుతూ.. రైతు సమస్యలపై అపారమైన అధ్యయనం చేసి, వాటి పరిష్కారం దిశగా అలుపెరగని ఉద్యమాలు నిర్మించిన గొప్ప పోరాట యోధుడు, నిఖార్సయిన విజ్ఞాన ఖని సారంపల్లి మల్లారెడ్డి అని కొనియాడారు. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకాల్లో తెలంగాణ ప్రాంతానికి జరిగిన చారిత్రక అన్యాయాన్ని పలు జాతీయ, ప్రాంతీయ వేదికలపై గళమెత్తి ప్రజల్లో విస్తృత చైతన్యం తెచ్చిన మహనీయుడు మల్లారెడ్డి అని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు గుర్తుచేశారు. అంతేకాకుండా, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం ఉధృతమైన ప్రజా పోరాటాలను ముందుండి నడిపించారని ప్రశంసించారు.
మల్లారెడ్డి మృతి యావత్ రైతాంగానికి, శ్రామిక లోకానికి తీరని లోటని పేర్కొంటూ, ఆయన కుటుంబ సభ్యులకు, సీపీఎం పార్టీ శ్రేణులకు ఓసీ జేఏసీ తరఫున ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఇదే వేదికపై మరో కీలక ప్రకటన చేస్తూ.. ఈ నెల 27వ తేదీన హైదరాబాద్ మహానగరంలో ఓసీ జేఏసీ రాష్ట్ర సర్వసభ్య సమావేశాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఓసీ జేఏసీ జాతీయ చైర్మన్ నల్లా సంజీవరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ తాడిశెట్టి పశుపతి, ప్రధాన కార్యదర్శి దుబ్బా శ్రీనివాస్‌లతో పాటు వివిధ జిల్లాల ముఖ్య నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

దళిత స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే దొరల ఇళ్ల ముందు చావుడప్పు కొడతాం బిడ్డ! 24 గంటల్లో తాతా మధు, కేసీఆర్, కేటీఆర్ క్షమాపణ చెప్పాలి: హుజురాబాద్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఇల్లందుల శ్రీనివాస్ డిమాండ్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !