బాహు బలంన్యూస్ ఎల్కతుర్తి, సెప్టెంబర్ 02 : ఎల్కతుర్త సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు స్వీకరించిన కొండ్ర శ్రీనును పలువురు కాంగ్రెస్ నాయకులు, జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిశారు. సీఐ కార్యాలయంలో ఆయనను కలిసి శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు తమవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
సీఐను కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బొల్లెపోగు రమేష్ బాబు, ఎర్రోళ్ల జగజ్జీవన్, ఎర్రోళ్ల రాజేష్, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు శనిగరపు వెంకటేష్, సీనియర్ జర్నలిస్టు ఎర్రోళ్ల సతీష్ తదితరులు ఉన్నారు.
Post Views: 298










