బాహు బలంన్యూస్,మానకొండూర్,ఆగస్టు 30 :
అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, కలివిడిగా ఉండే స్నేహశీలి, ప్రముఖ ప్రవాస భారతీయుడు, సామాజికవేత్త కోరుకంటి మధుసూదన్ రావు గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు, ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పోలాడి రామారావు విచారం వ్యక్తం చేశారు. మానకొండూర్ మండలం వెల్ది గ్రామంలో ఆదివారం నిర్వహించిన మధుసూదన్ రావు దశదిన కర్మ (పెద్ద కర్మ) కార్యక్రమంలో ఆయన పాల్గొని, మధుసూదన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ.. సామాన్యుల, రైతుల సమస్యల పరిష్కారానికి, గ్రామాభివృద్ధికి లక్షలాది రూపాయల సొంత నిధులు ఖర్చు చేసి ప్రజల మన్ననలు పొందిన ‘ప్రజా బంధు’ మధుసూదన్ రావు మృతి గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబానికి ప్రజా సంఘాల తరపున ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
అంతకుముందు, కాలి శస్త్రచికిత్స చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సీనియర్ తెదేపా నాయకుడు వెల్ది వీరాచారిని పోలాడి రామారావు పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు గోపు సత్యనారాయణ రెడ్డి, మాధవరం సంజీవరావు, కోరుకంటి శ్రీనివాస్ రావు, ఎడ్ల కనకారెడ్డి, కలకుంట్ల లక్ష్మీ రామచందర్ రావు, కోరుకంటి లక్ష్మణ్ రావు, కిషన్ రావు, వెల్ది గంగారామ్, గ్రామ సర్పంచ్ కిషన్ పటేల్, మాజీ సర్పంచ్ కుమార్ తదితరులతో పాటు గ్రామ ప్రజలు, వివిధ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











