హామీల అమల్లో తీవ్ర నిర్లక్ష్యం: నిధులు లేని కార్పొరేషన్లతో కాలయాపన,: ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. ఈ నెల 8న హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద రెడ్డి సంఘాల భారీ నిరసన దీక్ష. పూర్తి మద్దతు ప్రకటించిన ఓసీ ఐకాస. పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపు రెడ్డి కార్పొరేషన్‌కు ₹1,000 కోట్ల నిధులు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు ప్రధాన డిమాండ్లు.

bahubalamtv Reporter
bahubalamtv.in

హామీల అమల్లో తీవ్ర నిర్లక్ష్యం: నిధులు లేని కార్పొరేషన్లతో కాలయాపన,: ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. ఈ నెల 8న హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద రెడ్డి సంఘాల భారీ నిరసన దీక్ష. పూర్తి మద్దతు ప్రకటించిన ఓసీ ఐకాస. పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపు రెడ్డి కార్పొరేషన్‌కు ₹1,000 కోట్ల నిధులు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు ప్రధాన డిమాండ్లు.

బాహు బలంన్యూస్,కరీంనగర్‌ ఆగస్టు 30 :
ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కుతూ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని ఓసీ జేఏసీ మండిపడుతోంది. నామమాత్రపు ప్రకటనలతో సరిపెడుతూ క్షేత్రస్థాయిలో సమస్యలను విస్మరిస్తున్న పాలకుల తీరును ఎండగట్టేందుకు పోరుబాటకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 8న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద రాష్ట్ర రెడ్డి సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో తలపెట్టిన మహాధర్నాకు ఓసీ జేఏసీ సంపూర్ణ సంఘీభావం ప్రకటించింది. ఆదివారం కరీంనగర్‌లోని శ్రీనివాస హోటల్‌లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశంలో జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పాల్గొని ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు.
ప్రకటనలకే పరిమితమైన కార్పొరేషన్లు
రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించి చేతులు దులుపుకుందే తప్ప, ఇంతవరకు పూర్తిస్థాయి పాలకవర్గాన్ని నియమించలేదని, రూపాయి నిధులు కూడా కేటాయించలేదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డి కార్పొరేషన్‌తో పాటు ఇతర ఓసీ ఉపకులాల కార్పొరేషన్లకు సైతం కనీస బడ్జెట్ కేటాయించకుండా నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తక్షణమే రెడ్డి కార్పొరేషన్‌కు ₹1,000 కోట్ల నిధులు విడుదల చేసి, పూర్తిస్థాయి పాలకమండలిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈడబ్ల్యూఎస్, ఫీజు బకాయిలపై పాలకుల ఉదాసీనత
విద్యా, ఉద్యోగ రంగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) 10 శాతం రిజర్వేషన్లను అన్ని విభాగాల్లో పకడ్బందీగా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఐకాస నేతలు విమర్శించారు. ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న సుమారు ₹12,000 కోట్ల విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను నోటిఫికేషన్ల ద్వారా యుద్ధప్రాతిపదికన భర్తీ చేయడంతో పాటు, రైతులకు భరోసానిచ్చే 'రైతు బీమా' పథకాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా కొనసాగించాలని స్పష్టం చేశారు.
చలో ఇందిరాపార్కుకు కదంతొక్కాలి
న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 8న ఇందిరాపార్కు వేదికగా జరిగే నిరసన దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఓసీ వర్గాలు, మేధావులు, యువత, ప్రజాసంఘాల నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పోలాడి రామారావు పిలుపునిచ్చారు.
ఈ సన్నాహక భేటీలో ముఖ్య నాయకులు కేతిరి మణిశంకర్ రెడ్డి, అండెం రమణారెడ్డి, రూప్‌రెడ్డి సత్యనారాయణ రెడ్డి, తోపుచర్ల శ్రీనివాసరావు, కొత్తకొండ రవీందర్‌రావు, తాటిపల్లి రాజన్న, కంకణాల రాజిరెడ్డి, గన్ను నరసింహారెడ్డి, వెలమ రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్,కరీంనగర్‌ ఆగస్టు 30 :
ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కుతూ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని ఓసీ జేఏసీ మండిపడుతోంది. నామమాత్రపు ప్రకటనలతో సరిపెడుతూ క్షేత్రస్థాయిలో సమస్యలను విస్మరిస్తున్న పాలకుల తీరును ఎండగట్టేందుకు పోరుబాటకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 8న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద రాష్ట్ర రెడ్డి సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో తలపెట్టిన మహాధర్నాకు ఓసీ జేఏసీ సంపూర్ణ సంఘీభావం ప్రకటించింది. ఆదివారం కరీంనగర్‌లోని శ్రీనివాస హోటల్‌లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశంలో జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పాల్గొని ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు.
ప్రకటనలకే పరిమితమైన కార్పొరేషన్లు
రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించి చేతులు దులుపుకుందే తప్ప, ఇంతవరకు పూర్తిస్థాయి పాలకవర్గాన్ని నియమించలేదని, రూపాయి నిధులు కూడా కేటాయించలేదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డి కార్పొరేషన్‌తో పాటు ఇతర ఓసీ ఉపకులాల కార్పొరేషన్లకు సైతం కనీస బడ్జెట్ కేటాయించకుండా నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తక్షణమే రెడ్డి కార్పొరేషన్‌కు ₹1,000 కోట్ల నిధులు విడుదల చేసి, పూర్తిస్థాయి పాలకమండలిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈడబ్ల్యూఎస్, ఫీజు బకాయిలపై పాలకుల ఉదాసీనత
విద్యా, ఉద్యోగ రంగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) 10 శాతం రిజర్వేషన్లను అన్ని విభాగాల్లో పకడ్బందీగా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఐకాస నేతలు విమర్శించారు. ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న సుమారు ₹12,000 కోట్ల విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను నోటిఫికేషన్ల ద్వారా యుద్ధప్రాతిపదికన భర్తీ చేయడంతో పాటు, రైతులకు భరోసానిచ్చే ‘రైతు బీమా’ పథకాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా కొనసాగించాలని స్పష్టం చేశారు.
చలో ఇందిరాపార్కుకు కదంతొక్కాలి
న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 8న ఇందిరాపార్కు వేదికగా జరిగే నిరసన దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఓసీ వర్గాలు, మేధావులు, యువత, ప్రజాసంఘాల నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పోలాడి రామారావు పిలుపునిచ్చారు.
ఈ సన్నాహక భేటీలో ముఖ్య నాయకులు కేతిరి మణిశంకర్ రెడ్డి, అండెం రమణారెడ్డి, రూప్‌రెడ్డి సత్యనారాయణ రెడ్డి, తోపుచర్ల శ్రీనివాసరావు, కొత్తకొండ రవీందర్‌రావు, తాటిపల్లి రాజన్న, కంకణాల రాజిరెడ్డి, గన్ను నరసింహారెడ్డి, వెలమ రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి! – ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి డిమాండ్ అన్ని వర్గాల నిరుపేదలకూ సమన్యాయం కల్పించడమే ఉద్యమ లక్ష్యం. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేయాలి.. చట్టబద్ధ కమిషన్‌తో సమగ్ర అధ్యయనం చేపట్టాలి. ఈ నెల 26న పరకాలలో 50 వేల మందితో మహాసభ… గోడపత్రికల ఆవిష్కరణ

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి – అన్ని వర్గాల పేదలకు సమన్యాయం కల్పించడమే ధ్యేయం – చట్టబద్ధమైన కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి – ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త రథయాత్రకు సంపూర్ణ మద్దతు:. ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పూసల ప్రభావతి రెడ్డి..

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి.. పోలాడి రామారావు, గోపు జైపాల్ రెడ్డి – అన్ని వర్గాల పేదలకు విద్య, ఉపాధి రంగాల్లో సమన్యాయం కల్పించాలి – ఓసీ జేఏసీ, ఆర్యవైశ్య మహాసభ నేతల స్పష్టీకరణ….

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. పోలాడి రామారావు డిమాండ్. అన్ని సామాజిక వర్గాల పేదలకు సమన్యాయం కల్పించాలి. ఆర్థిక స్థితిగతుల అధ్యయనానికి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. అక్టోబర్ 26న పరకాలలో 50 వేల మందితో బహిరంగ సభ.. జనగామలో ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం.

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల కోసం ప్రత్యేక చట్టం తేవాలి,. ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు , అన్ని వర్గాల పేదలకు సమన్యాయం కల్పించాలి. చట్టబద్ధ కమిషన్ ఏర్పాటుకు డిమాండ్,. ఓసీ జేఏసీ డిమాండ్.. అక్టోబర్ 26న పరకాలలో భారీ బహిరంగ సభ….

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. ఓసీ జేఏసీ డిమాండ్. కుల, మతాలకు అతీతంగా పేదలందరికీ సమన్యాయం కల్పించాలి…. అన్ని వర్గాల స్థితిగతులపై చట్టబద్ధ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈనెల 26న పరకాలలో భారీ బహిరంగ సభ రథయాత్రకు ఓసీ జేఏసీ, బహుజన సంఘాల సంపూర్ణ మద్దతు…

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !