బాహు బలంన్యూస్ హుజురాబాద్ ఆగస్టు 31: కష్టాల్లో ఉన్న తమ పదో తరగతి సహచర విద్యార్థినికి పూర్వ విద్యార్థులు అండగా నిలిచారు. రాంపూర్ గ్రామానికి చెందిన కొక్కుల రజిత భర్త ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న ఆమె పదో తరగతి క్లాస్‌మేట్స్ చలించిపోయి, తమవంతు బాధ్యతగా రూ. 20,500 (ఇరవై వేల ఐదు వందల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
తోటి విద్యార్థిని కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సాయం అందించిన మిత్రులందరికీ నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సహాయ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఎల్లయ్య, మిడిదొడ్డి రాజు, నవీన్, రావుల సురేష్, జెట్టి నరేష్, అనిత, పుష్పలత, వనజ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 8










