పాలిటెక్నిక్‌ కళాశాలల భూములపై ప్రైవేటు వ్యక్తుల కన్ను! తక్షణమే ‘జీవో 97’ను రద్దు చేయాలి. మహీంద్రా వర్సిటీలో విలీనంపై మండిపాటు. ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

bahubalamtv Reporter
bahubalamtv.in

పాలిటెక్నిక్‌ కళాశాలల భూములపై ప్రైవేటు వ్యక్తుల కన్ను! తక్షణమే ‘జీవో 97’ను రద్దు చేయాలి. మహీంద్రా వర్సిటీలో విలీనంపై మండిపాటు. ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

బాహు బలంన్యూస్,కరీంనగర్‌, సెప్టెంబర్ 01:
రాష్ట్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలను మూసివేసే కుట్రలను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని, ఇందుకు జారీ చేసిన జీవో 97ను బేషరతుగా రద్దు చేయాలని ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్‌ చేశారు. మంగళవారం కరీంనగర్‌ తెలంగాణ చౌక్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
సాంకేతిక విద్యా రంగంలో పేద, మధ్యతరగతి విద్యార్థులకు భరోసానిచ్చే పాలిటెక్నిక్‌ వ్యవస్థను మహీంద్రా స్కిల్‌ యూనివర్సిటీలో విలీనం చేయాలని చూడటం దారుణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్‌ కళాశాలలకు వేల కోట్ల విలువైన ఆస్తులున్నాయని, ముఖ్యంగా హైదరాబాద్‌ మాసాబ్‌ట్యాంక్‌ కళాశాలకు ఉన్న రూ.5 వేల కోట్ల భూములపై ప్రైవేటు శక్తులు ఎప్పటినుంచో కన్నేశాయని ఆరోపించారు. ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాసినట్లు పేర్కొంటూ, ఆ లేఖ ప్రతులను విడుదల చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే విద్యార్థులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమల్లో తీవ్ర నిర్లక్ష్యం: నిధులు లేని కార్పొరేషన్లతో కాలయాపన,: ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. ఈ నెల 8న హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద రెడ్డి సంఘాల భారీ నిరసన దీక్ష. పూర్తి మద్దతు ప్రకటించిన ఓసీ ఐకాస. పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపు రెడ్డి కార్పొరేషన్‌కు ₹1,000 కోట్ల నిధులు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు ప్రధాన డిమాండ్లు.

భూ వివాదాల పరిష్కారానికే డిజిటల్ సర్వే . వన్నారంలో రెవెన్యూ సర్వేను ప్రారంభించిన తహసీల్దార్ విజయ్‌కుమార్ . రైతుల సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యం. రైతు ప్రజా సంఘాల ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు…

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !