తెలంగాణ వైతాళికుడు రాజా బహదూర్ వెంకట్ రాంరెడ్డి: ఘనంగా 157వ జయంతి వేడుకలు విద్యోన్నతికి ఆయన చూపిన దాతృత్వం అజరామరం: ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

bahubalamtv Reporter
bahubalamtv.in

తెలంగాణ వైతాళికుడు రాజా బహదూర్ వెంకట్ రాంరెడ్డి: ఘనంగా 157వ జయంతి వేడుకలు విద్యోన్నతికి ఆయన చూపిన దాతృత్వం అజరామరం: ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

బాహు బలంన్యూస్ ​కరీంనగర్ ఆగస్టు 22:
తెలంగాణ వైతాళికుడు, నిరుపమాన సంఘ సంస్కర్త, నాటి హైదరాబాద్ నగర కొత్వాల్ (ప్రస్తుత పోలీస్ కమిషనర్ హోదా) రాజా బహదూర్ వెంకట్ రాంరెడ్డి సమాజానికి, విద్యా వికాసానికి చేసిన సేవలు అజరామరమని ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు కొనియాడారు. బడుగు, బలహీన, ఓసీ నిరుపేద విద్యార్థుల ఉన్నతి కోసం ఆయన చూపిన దాతృత్వం తరతరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు.
​రాజా బహదూర్ వెంకట్ రాంరెడ్డి 157వ జయంతిని పురస్కరించుకుని శనివారం కరీంనగర్‌లోని ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధాన కూడలి వద్ద ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి ఓసీ ఐకాస నాయకులతో కలిసి పోలాడి రామారావు ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు.
​ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ.. బ్రిటిష్, నిజాం నవాబుల పరిపాలనా కాలంలో అత్యంత కీలకమైన పోలీస్ కొత్వాల్‌గా బాధ్యతలు నిర్వర్తించిన వెంకట్ రాంరెడ్డి, శాంతిభద్రతల పరిరక్షణలో తనదైన ముద్ర వేయడమే కాకుండా సామాన్య ప్రజల పక్షపాతిగా సేవలందించారని గుర్తుచేశారు. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థీ ఉన్నత చదువులకు దూరం కాకూడదనే సదాశయంతో హైదరాబాద్ నడిబొడ్డున ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు, ఉచిత వసతి గృహాలను (హాస్టళ్లు) నెలకొల్పారని తెలిపారు. కులమతాలకు అతీతంగా పేద విద్యార్థులందరికీ ఉచిత వసతి, నాణ్యమైన భోజనం, విద్యా సౌకర్యాలు కల్పించి భావితరాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారని ప్రశంసించారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయడమే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు.
​ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా, రాష్ట్ర ఓసీ జేఏసీ ప్రముఖ నాయకులు పెండ్యాల కేశవరెడ్డి, బండ గోపాల్‌రెడ్డి, పెండ్యాల రాంరెడ్డి, జున్నుతుల రాజిరెడ్డి, ఏనుగు చొక్కారెడ్డి, బీరెడ్డి కరుణాకర్‌రెడ్డి, కొత్తకొండ రవీందర్‌రావు, అండెం రమణారెడ్డి, జిల్లా అంజయ్య, వేముల సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లకు చట్టం తేవాలి . అన్ని వర్గాల పేదలకు సమన్యాయం కల్పించాలి . ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సుయాత్రకు సంపూర్ణ మద్దతు . ఓసీ జేఏసీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు పోలాడి రామారావు, గోపు జైపాల్ రెడ్డి ‘సమాజ సేవా సామ్రాట్’ గ్రహీత దుబ్బా శ్రీనివాస్‌కు ఘన సన్మానం.

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్. దేశవ్యాప్త బస్సు యాత్రకు ఓసీ ఐకాస సంపూర్ణ మద్దతు. ప్రస్తుత విధానంలో క్రీమీలేయర్ లేక అట్టడుగు వర్గాలకు అన్యాయం. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేసి ప్రత్యేక కమిషన్ వేయాలి . కరీంనగర్ సమావేశంలో వెల్లడి…

ఆర్థిక ప్రాతిపదికనే రిజర్వేషన్లు కల్పించాలి. కుల, మతాల ప్రాతిపదికన కాకుండా పేదరికమే కొలమానం కావాలి . కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాజ్యాంగ కమిషన్‌ను నియమించాలి. ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సు యాత్రకు ఓసీ జేఏసీ సంపూర్ణ మద్దతు. తెలంగాణ భవన్‌లో జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు వెల్లడి.

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ల సాధనే ధ్యేయం: ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. – రాంపూర్ చౌరస్తాలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు. – బాపూజీ బాటలోనే హక్కుల సాధనకు శాంతియుత పోరాటం. – ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సు యాత్రకు సంపూర్ణ మద్దతు…

ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలి. సీఎం రేవంత్‌ రెడ్డికి పోలాడి రామారావు ఘాటు బహిరంగ లేఖ. – ‘ప్రభుత్వం ఏర్పడి 33 నెలలు గడుస్తున్నా ప్రజలకు నిరాశే మిగిలింది’ – విద్యార్థులు, రైతులు, సామాజిక వర్గాల సంక్షేమాన్ని విస్మరిస్తే ఊరుకోం. ఓసీ, రైతు ప్రజా సంఘాల జేఏసీ హెచ్చరిక…

డాక్టర్‌ నాగుల సత్యంగౌడ్‌కు జాతీయస్థాయి ‘విశ్వ కళావిభూషణ్‌’ పురస్కారం. ఘనంగా గురు కిరీట ధారణ.. పట్టుశాలువాతో సత్కారం. ఆధ్యాత్మిక, సామాజిక సేవలకు దక్కిన గుర్తింపు. హనుమకొండలో పలు సంస్థల ఆధ్వర్యంలో పురస్కార ప్రదానం…

హుజూరాబాద్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ పదవికి కొలిపాక శంకర్‌ పోటీ. నిష్కపటమైన విధేయతకే నా ప్రాధాన్యం. .. వలస పక్షులకు పగ్గాలు అప్పగిస్తే సహించేది లేదు. అధికారం మారగానే గూడు మారిన వారికి పట్టం కడతారా?: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నిప్పులు….

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !