కరీంనగర్ డైరీని కాపాడుకుంటాం.. కుట్రలను తిప్పికొడతాం.. పాల రైతుల జోలికొస్తే కలెక్టరేట్ ముట్టడి తప్పదు.. రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడి పోలాడి రామారావు హెచ్చరిక.

bahubalamtv Reporter
bahubalamtv.in

కరీంనగర్ డైరీని కాపాడుకుంటాం.. కుట్రలను తిప్పికొడతాం.. పాల రైతుల జోలికొస్తే కలెక్టరేట్ ముట్టడి తప్పదు.. రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడి పోలాడి రామారావు హెచ్చరిక.

బాహు బలంన్యూస్,కరీంనగర్, ఆగస్టు 17 : పాలకుల స్వార్థ ప్రయోజనాల కోసం ప్రైవేట్ డెయిరీలకు లబ్ధి చేకూర్చేందుకు కరీంనగర్ పాల డెయిరీని విచ్ఛిన్నం చేసే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నామని రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు స్పష్టం చేశారు. డెయిరీ ఆస్తుల అక్రమ స్వాధీనానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలో ఆయన పాడి రైతుల తరఫున గళమెత్తారు. డెయిరీ చైర్మన్ చలిమెడ రాజేశ్వర్ రావుతో కలిసి సుమారు 5 వేల మంది పాడి రైతులతో పద్మనగర్ నుంచి కలెక్టరేట్ వరకు చేపట్టిన భారీ శాంతియుత పాదయాత్రలో రామారావు ముందుండి నడిపించారు. అనంతరం ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు.
రైతుల చెమటతో నిర్మించిన వ్యవస్థ ఇది: రామారావు..
1989 కంటే ముందు నాటి పరిస్థితులను గుర్తుచేస్తూ పోలాడి రామారావు కీలక విషయాలు వెల్లడించారు. "అప్పట్లో ప్రభుత్వ జోక్యంతో ఉన్న కరీంనగర్ మిల్క్ ఫెడరేషన్ కేవలం 20 వేల లీటర్ల పాల సేకరణతో, రూ.1.30 కోట్ల భారీ నష్టాల్లో కూరుకుపోయింది. కానీ 1989లో రైతుల భాగస్వామ్యంతో 'కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ సొసైటీ'గా రూపాంతరం చెందాక, ప్రభుత్వ జోక్యం లేకుండా రోజుకు 2 లక్షల లీటర్ల ఉత్పత్తి స్థాయికి ఎదిగింది. కోట్ల రూపాయల లాభాలతో 3 వేల మందికి ప్రత్యక్షంగా, 30 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ ఉమ్మడి జిల్లా పాడి రైతులకు ఆర్థిక వెన్నెముకగా నిలిచింది" అని ఆయన వివరించారు.
రియల్ ఎస్టేట్ మాఫియా కోసమే ప్రభుత్వ కుట్రలు
ధరణి పోర్టల్‌లో కరీంనగర్ డెయిరీ పేరిట ఉన్న 11 ఎకరాల విలువైన భూమిని అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా తొలగించి, కొత్త భూమాత పోర్టల్‌లో పాత ఫెడరేషన్ లో ఉన్నా 11ఎకరాలను అక్రమంగా నమోదు చేయడాన్ని రామారావు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ పెద్దలు తమ రియల్ ఎస్టేట్ స్వార్థ ప్రయోజనాలు, ప్రైవేట్ వ్యాపారుల లాభాల కోసమే ఈ కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే ఈ అక్రమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వేలాది మంది రైతులతో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ ఆందోళన కార్యక్రమంలో రైతు ప్రజా సంఘాల నాయకులు గన్ను నర్సింహారెడ్డి, ఆకారపు గౌతమ్ రెడ్డి, శంకరయ్య గౌడ్, కాల్వ వెంకట్, మహేష్, నరేష్, మల్లయ్య, వెంకటయ్య, తీగల లక్ష్మణ్ రావు తదితరులతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చిన రైతు సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్,కరీంనగర్, ఆగస్టు 17 : పాలకుల స్వార్థ ప్రయోజనాల కోసం ప్రైవేట్ డెయిరీలకు లబ్ధి చేకూర్చేందుకు కరీంనగర్ పాల డెయిరీని విచ్ఛిన్నం చేసే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నామని రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు స్పష్టం చేశారు. డెయిరీ ఆస్తుల అక్రమ స్వాధీనానికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలో ఆయన పాడి రైతుల తరఫున గళమెత్తారు. డెయిరీ చైర్మన్ చలిమెడ రాజేశ్వర్ రావుతో కలిసి సుమారు 5 వేల మంది పాడి రైతులతో పద్మనగర్ నుంచి కలెక్టరేట్ వరకు చేపట్టిన భారీ శాంతియుత పాదయాత్రలో రామారావు ముందుండి నడిపించారు. అనంతరం ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు.
రైతుల చెమటతో నిర్మించిన వ్యవస్థ ఇది: రామారావు..
1989 కంటే ముందు నాటి పరిస్థితులను గుర్తుచేస్తూ పోలాడి రామారావు కీలక విషయాలు వెల్లడించారు. “అప్పట్లో ప్రభుత్వ జోక్యంతో ఉన్న కరీంనగర్ మిల్క్ ఫెడరేషన్ కేవలం 20 వేల లీటర్ల పాల సేకరణతో, రూ.1.30 కోట్ల భారీ నష్టాల్లో కూరుకుపోయింది. కానీ 1989లో రైతుల భాగస్వామ్యంతో ‘కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ సొసైటీ’గా రూపాంతరం చెందాక, ప్రభుత్వ జోక్యం లేకుండా రోజుకు 2 లక్షల లీటర్ల ఉత్పత్తి స్థాయికి ఎదిగింది. కోట్ల రూపాయల లాభాలతో 3 వేల మందికి ప్రత్యక్షంగా, 30 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ ఉమ్మడి జిల్లా పాడి రైతులకు ఆర్థిక వెన్నెముకగా నిలిచింది” అని ఆయన వివరించారు.
రియల్ ఎస్టేట్ మాఫియా కోసమే ప్రభుత్వ కుట్రలు
ధరణి పోర్టల్‌లో కరీంనగర్ డెయిరీ పేరిట ఉన్న 11 ఎకరాల విలువైన భూమిని అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా తొలగించి, కొత్త భూమాత పోర్టల్‌లో పాత ఫెడరేషన్ లో ఉన్నా 11ఎకరాలను అక్రమంగా నమోదు చేయడాన్ని రామారావు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ పెద్దలు తమ రియల్ ఎస్టేట్ స్వార్థ ప్రయోజనాలు, ప్రైవేట్ వ్యాపారుల లాభాల కోసమే ఈ కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే ఈ అక్రమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వేలాది మంది రైతులతో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈ ఆందోళన కార్యక్రమంలో రైతు ప్రజా సంఘాల నాయకులు గన్ను నర్సింహారెడ్డి, ఆకారపు గౌతమ్ రెడ్డి, శంకరయ్య గౌడ్, కాల్వ వెంకట్, మహేష్, నరేష్, మల్లయ్య, వెంకటయ్య, తీగల లక్ష్మణ్ రావు తదితరులతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వచ్చిన రైతు సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లకు చట్టం తేవాలి . అన్ని వర్గాల పేదలకు సమన్యాయం కల్పించాలి . ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సుయాత్రకు సంపూర్ణ మద్దతు . ఓసీ జేఏసీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు పోలాడి రామారావు, గోపు జైపాల్ రెడ్డి ‘సమాజ సేవా సామ్రాట్’ గ్రహీత దుబ్బా శ్రీనివాస్‌కు ఘన సన్మానం.

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్. దేశవ్యాప్త బస్సు యాత్రకు ఓసీ ఐకాస సంపూర్ణ మద్దతు. ప్రస్తుత విధానంలో క్రీమీలేయర్ లేక అట్టడుగు వర్గాలకు అన్యాయం. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేసి ప్రత్యేక కమిషన్ వేయాలి . కరీంనగర్ సమావేశంలో వెల్లడి…

ఆర్థిక ప్రాతిపదికనే రిజర్వేషన్లు కల్పించాలి. కుల, మతాల ప్రాతిపదికన కాకుండా పేదరికమే కొలమానం కావాలి . కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాజ్యాంగ కమిషన్‌ను నియమించాలి. ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సు యాత్రకు ఓసీ జేఏసీ సంపూర్ణ మద్దతు. తెలంగాణ భవన్‌లో జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు వెల్లడి.

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ల సాధనే ధ్యేయం: ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. – రాంపూర్ చౌరస్తాలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు. – బాపూజీ బాటలోనే హక్కుల సాధనకు శాంతియుత పోరాటం. – ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సు యాత్రకు సంపూర్ణ మద్దతు…

ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలి. సీఎం రేవంత్‌ రెడ్డికి పోలాడి రామారావు ఘాటు బహిరంగ లేఖ. – ‘ప్రభుత్వం ఏర్పడి 33 నెలలు గడుస్తున్నా ప్రజలకు నిరాశే మిగిలింది’ – విద్యార్థులు, రైతులు, సామాజిక వర్గాల సంక్షేమాన్ని విస్మరిస్తే ఊరుకోం. ఓసీ, రైతు ప్రజా సంఘాల జేఏసీ హెచ్చరిక…

డాక్టర్‌ నాగుల సత్యంగౌడ్‌కు జాతీయస్థాయి ‘విశ్వ కళావిభూషణ్‌’ పురస్కారం. ఘనంగా గురు కిరీట ధారణ.. పట్టుశాలువాతో సత్కారం. ఆధ్యాత్మిక, సామాజిక సేవలకు దక్కిన గుర్తింపు. హనుమకొండలో పలు సంస్థల ఆధ్వర్యంలో పురస్కార ప్రదానం…

హుజూరాబాద్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ పదవికి కొలిపాక శంకర్‌ పోటీ. నిష్కపటమైన విధేయతకే నా ప్రాధాన్యం. .. వలస పక్షులకు పగ్గాలు అప్పగిస్తే సహించేది లేదు. అధికారం మారగానే గూడు మారిన వారికి పట్టం కడతారా?: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నిప్పులు….

తెలంగాణ ఉద్యమ ధ్రువతార.. త్యాగాల శిఖరం బాపూజీ.. పదవులను తృణప్రాయంగా విసిరికొట్టిన అసలుసిసలైన ప్రజానాయకుడు.. సామాజిక న్యాయం, శ్రామిక రాజ్యం కోసమే నిరంతర ఆరాటం… హన్మకొండలో కొండా లక్ష్మణ్ జయంతి వేళ గర్జించిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ పోలాడి రామారావు….

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !