ధాన్యపు కొనుగోళ్లలో సర్కార్ నిర్లక్ష్యం: విలవిలలాడుతున్న అన్నదాతలు – తరుగు పేరుతో క్వింటాల్‌కు 8 కిలోల కోత విధిస్తూ నిలువు దోపిడీ – మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన సమరభేరి’ – రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ధ్వజం.

bahubalamtv Reporter
bahubalamtv.in

ధాన్యపు కొనుగోళ్లలో సర్కార్ నిర్లక్ష్యం: విలవిలలాడుతున్న అన్నదాతలు – తరుగు పేరుతో క్వింటాల్‌కు 8 కిలోల కోత విధిస్తూ నిలువు దోపిడీ – మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన సమరభేరి’ – రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ధ్వజం.

బాహు బలం న్యూస్ వీణవంక, మే 23:
ఆరుగాలం శ్రమించి, చెమటోడ్చి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి అన్నదాతలు రోజుల తరబడి రోడ్లపైనే పడిగాపులు కాయాల్సిన దుస్థితి రావడం అత్యంత బాధాకరమని రైతు ప్రజా సంఘాల ఐకాస (జేఏసీ) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో నెల రోజులకు పైగా ధాన్యపు రాశులు పేరుకుపోయి, ఒకపక్క అకాల వర్షాలు, మరోపక్క తీవ్రమైన ఎండల కారణంగా రైతులు వడదెబ్బకు గురవుతున్నారని, ఇది రాష్ట్రంలో రైతన్నల దయనీయ స్థితికి అద్దం పడుతోందని మండిపడ్డారు.
శనివారం హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండలంలోని బేతిగల్, కిష్టంపేట, మల్లారెడ్డిపల్లి, కోర్కల్, ఎలబాక, గంగారం, చల్లూర్, మామిడాలపల్లి తదితర గ్రామాల్లోని ధాన్యపు కొనుగోలు కేంద్రాలను రైతు ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మామిడాలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కేంద్రంపై నెపం నెట్టడం బాధ్యతారాహిత్యం
రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాల్సి ఉండగా, తన విధిని విస్మరించి, నిర్లక్ష్య వైఖరితో ఆ నెపాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెట్టడం పాలకుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని పోలాడి రామారావు విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు కల్పించడంలోనూ, సకాలంలో కాంటాలు పెట్టడంలోనూ యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్నారు. హమాలీల కొరత, రవాణా (లారీల) కొరత ఉందనే కుంటిసాకులు చెప్తూ నెల రోజులుగా కొనుగోళ్లను నానబెట్టడం దారుణమని ధ్వజమెత్తారు.
మిల్లర్లతో కుమ్మక్కై నిలువు దోపిడీ
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యానికి తరుగు పేరుతో క్వింటాల్‌కు ఏకంగా 8 కిలోల వరకు కోత విధిస్తూ రైతులను అరిగోస పెడుతున్నారని రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు, ఐకేపీ నిర్వాహకులు మిల్లు యజమానులతో (మిల్లర్లతో) కుమ్మక్కై రైతులను నిలువు దోపిడీకి గురిచేస్తున్నారని ఆరోపించారు. కష్టపడి పండించిన పంటను దళారుల పాలు చేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందని, ఈ దోపిడీకి ప్రభుత్వం త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
మే 30న కరీంనగర్‌లో సమరభేరి
రైతాంగ సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ, అన్నదాతల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మే 30వ తేదీన పోరాటాల గడ్డ కరీంనగర్ వేదికగా బృహత్ సభను నిర్వహించనున్నట్లు పోలాడి రామారావు వెల్లడించారు. రాష్ట్రస్థాయిలో లక్షలాది మంది రైతులు పాల్గొనే ఈ ‘రైతుల మహాగర్జన సమరభేరి’ సభ ద్వారా ప్రభుత్వం మెడలు వంచి, రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు. ఈ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ క్షేత్రస్థాయి పర్యటన మరియు సమావేశంలో రైతు ప్రజా సంఘాల ముఖ్య నాయకులు మూల పుల్లారెడ్డి, కిషన్ రెడ్డి, సమ్మయ్య, రవీందర్ రావు, దేవేందర్ రెడ్డి, మహిపాల్, సత్తి రెడ్డి, తిరుపతి రెడ్డి, మల్లేశం, రాజిరెడ్డి తదితరులు పాల్గొని రైతులకు మద్దతుగా నిలిచారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. ఓసీ జేఏసీ డిమాండ్. కుల, మతాలకు అతీతంగా పేదలందరికీ సమన్యాయం కల్పించాలి…. అన్ని వర్గాల స్థితిగతులపై చట్టబద్ధ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈనెల 26న పరకాలలో భారీ బహిరంగ సభ రథయాత్రకు ఓసీ జేఏసీ, బహుజన సంఘాల సంపూర్ణ మద్దతు…

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లకు చట్టం తేవాలి . అన్ని వర్గాల పేదలకు సమన్యాయం కల్పించాలి . ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సుయాత్రకు సంపూర్ణ మద్దతు . ఓసీ జేఏసీ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు పోలాడి రామారావు, గోపు జైపాల్ రెడ్డి ‘సమాజ సేవా సామ్రాట్’ గ్రహీత దుబ్బా శ్రీనివాస్‌కు ఘన సన్మానం.

ఆర్థిక ఆధారిత రిజర్వేషన్లకు ప్రత్యేక చట్టం తేవాలి. ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్. దేశవ్యాప్త బస్సు యాత్రకు ఓసీ ఐకాస సంపూర్ణ మద్దతు. ప్రస్తుత విధానంలో క్రీమీలేయర్ లేక అట్టడుగు వర్గాలకు అన్యాయం. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేసి ప్రత్యేక కమిషన్ వేయాలి . కరీంనగర్ సమావేశంలో వెల్లడి…

ఆర్థిక ప్రాతిపదికనే రిజర్వేషన్లు కల్పించాలి. కుల, మతాల ప్రాతిపదికన కాకుండా పేదరికమే కొలమానం కావాలి . కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాజ్యాంగ కమిషన్‌ను నియమించాలి. ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సు యాత్రకు ఓసీ జేఏసీ సంపూర్ణ మద్దతు. తెలంగాణ భవన్‌లో జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు వెల్లడి.

ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ల సాధనే ధ్యేయం: ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. – రాంపూర్ చౌరస్తాలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు. – బాపూజీ బాటలోనే హక్కుల సాధనకు శాంతియుత పోరాటం. – ప్రవీణ్ అరోరా దేశవ్యాప్త బస్సు యాత్రకు సంపూర్ణ మద్దతు…

ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలి. సీఎం రేవంత్‌ రెడ్డికి పోలాడి రామారావు ఘాటు బహిరంగ లేఖ. – ‘ప్రభుత్వం ఏర్పడి 33 నెలలు గడుస్తున్నా ప్రజలకు నిరాశే మిగిలింది’ – విద్యార్థులు, రైతులు, సామాజిక వర్గాల సంక్షేమాన్ని విస్మరిస్తే ఊరుకోం. ఓసీ, రైతు ప్రజా సంఘాల జేఏసీ హెచ్చరిక…

డాక్టర్‌ నాగుల సత్యంగౌడ్‌కు జాతీయస్థాయి ‘విశ్వ కళావిభూషణ్‌’ పురస్కారం. ఘనంగా గురు కిరీట ధారణ.. పట్టుశాలువాతో సత్కారం. ఆధ్యాత్మిక, సామాజిక సేవలకు దక్కిన గుర్తింపు. హనుమకొండలో పలు సంస్థల ఆధ్వర్యంలో పురస్కార ప్రదానం…

హుజూరాబాద్‌ సింగిల్‌ విండో చైర్మన్‌ పదవికి కొలిపాక శంకర్‌ పోటీ. నిష్కపటమైన విధేయతకే నా ప్రాధాన్యం. .. వలస పక్షులకు పగ్గాలు అప్పగిస్తే సహించేది లేదు. అధికారం మారగానే గూడు మారిన వారికి పట్టం కడతారా?: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నిప్పులు….

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !