ఎల్‌నినో దెబ్బకు ఎండుతున్న పొలాలు.. కన్నెపల్లి నీటితో రైతాంగాన్ని ఆదుకోవాలి.. మేడిగడ్డతో సంబంధం లేకుండా పంపులు ఆన్ చేయాలి… జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్.

బాహు బలంన్యూస్ కరీంనగర్, జూలై 05 :
ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల సాగునీరు అందక రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోందని, తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా గోదావరి జలాలను విడుదల చేసి రైతులను ఆదుకోవాలని రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్‌లో నిర్వహించిన రైతు ప్రజా సంఘాల రాష్ట్ర, ఉమ్మడి జిల్లాల నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీటి కొరత కారణంగా నేటికీ వరి నాట్లు వేయలేక అన్నదాతలు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు.
ఆ వృథా నీటిని ఎత్తిపోయండి!
ప్రస్తుతం కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద గోదావరి నది 93 మీటర్ల పైచిలుకు ఎత్తులో ప్రవహిస్తోందని పోలాడి రామారావు తెలిపారు. గత రెండు రోజులుగా దాదాపు 10 టీఎంసీల మేర గోదావరి నీరు అందుబాటులో ఉందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ గేట్లతో ఎలాంటి సంబంధం లేకుండా, కన్నెపల్లి పంప్‌హౌస్‌లోని రెండు పంపులను తక్షణమే ఆన్ చేసి నీటిని ఎత్తిపోయాలని కోరారు. లభ్యతగా ఉన్న నీటిని సద్వినియోగం చేసుకొని ఆయకట్టు రైతులకు తక్షణమే సాగునీరు అందించాలన్నారు.
ఏడు జిల్లాల రిజర్వాయర్లను నింపాలి..
కన్నెపల్లి ద్వారా ఎత్తిపోసే నీటితో మిడ్ మానేరు, లోయర్ మానేరు, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లతో పాటు మార్గమధ్యలో ఉన్న చెరువులన్నింటినీ నింపాలని రామారావు సూచించారు. దీనివల్ల ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలతో పాటు సూర్యాపేట తదితర ఏడు జిల్లాల రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికే ఆయా ప్రాజెక్టుల రిజర్వాయర్లలో కనీస స్థాయిలో కూడా నీటి నిల్వలు లేకపోవడంతో, తాగునీరు అందించడం కూడా దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే నష్టం..
గోదావరి ప్రవాహం తగ్గి రోజుకు 1 టీఎంసీ నీరు ఉన్నా కూడా అన్నారం, సుందిల్ల వద్ద తాత్కాలికంగా అడ్డుకట్టలు వేసి నీటిని వాడుకునే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని రామారావు కోరారు. ప్రభుత్వం ముందే అప్రమత్తమై ఉంటే ఇప్పటికే వృథాగా సముద్రంలో కలిసిపోయిన దాదాపు 20 టీఎంసీల నీటిని కాపాడుకునే వాళ్లమని, ఈ నష్టానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆయన విమర్శించారు.
ఈ సమావేశంలో రైతు ప్రజా సంఘాల రాష్ట్ర, జిల్లాల నాయకులు ల్యాగల వీరారెడ్డి, బోయినపల్లి శ్రీనివాస్ రావు, కొత్తకొండ రవీందర్ రావు, దండ వెంకటేశ్వర్ రావు, అండెం రమణా రెడ్డి, తోపు శ్రీనివాస్, తీగల లక్ష్మణ్, వెన్నమనేని విక్రమనరసింహా రావు తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !