హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

బాహు బలంన్యూస్ కరీంనగర్:ఎన్నికల సమయంలో అన్నదాతలకు ఇచ్చిన అనేక హామీలను అమలు చేయడంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా సాగుతున్న పాత పంట కొనుగోలు పద్ధతికి స్వస్తి పలికి, కేవలం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కోటా మేరకే పంటలను కొనుగోలు చేస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించడం దారుణమన్నారు. కొనుగోళ్ల ప్రక్రియ నుంచి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా చేతులెత్తేసి అన్నదాతలను తీవ్ర వంచనకు గురిచేస్తోందని ఆయన మండిపడ్డారు.

ఎన్నికల ప్రచారంలో రైతులు ఎన్ని వడ్లు పండించినా ప్రతి గింజనూ మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ ఇచ్చి పూర్తిగా కొనుగోలు చేస్తామని నమ్మబలికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని రామారావు గుర్తుచేశారు. తీరా గద్దెనెక్కిన తర్వాత మాట తిప్పి, కేవలం ఏడు రకాల సన్న వడ్లను మాత్రమే కొంటామని, కేంద్ర కోటాకు మించి తాము కొనలేమని చెప్పడం రైతాంగాన్ని దగా చేయడమేనన్నారు. వరి ధాన్యం కొనుగోళ్లపై ఇలాంటి ఆంక్షలు, పరిమితులు విధించి రైతులను మార్కెట్ యార్డుల దయాదాక్షిణ్యాలపై వదిలేస్తే అన్నదాతలు రోడ్డున పడి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

బకాయిలు రూ. 29,358 కోట్లు తక్షణమే విడుదల చేయాలి

ప్రస్తుత రేవంత్ సర్కార్ రైతులకు ఇచ్చిన రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, పంటల బోనస్, నిరంతర నీటి సరఫరా, కరెంట్ సరఫరా వంటి ప్రతి విషయంలోనూ కోతలు విధిస్తూ రైతు నడ్డి విరుస్తోందని రామారావు విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా మరణించిన రైతు కుటుంబాలకు చెందాల్సిన 7,600 రైతు బీమా క్లెయిమ్‌లను ప్రభుత్వం ఇంతవరకు అందించకుండా పెండింగ్‌లో పెట్టిందన్నారు. ఇప్పటికే గత మూడు విడతలకు సంబంధించిన రైతు భరోసా నిధులు రూ. 16,545 కోట్ల బకాయిలు అలాగే ఉండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత వానాకాలం సీజన్ భరోసా నిధులతో పాటు ఈ పెండింగ్ బకాయిలను కలుపుకుని మొత్తం రూ. 29,358 కోట్లను ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించబోయే అధికారిక సభా వేదిక ద్వారానే తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఏయే పంటలకు మద్దతు ధర ప్రకటిస్తుందో, వాటిని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని సరికొత్త నిబంధనలు పెట్టడం అంటే.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల నుండి ప్రభుత్వం పారిపోవడమేనని రామారావు దుయ్యబట్టారు. గత యాసంగి సీజన్ లోనే కేంద్రం వాటా మూడో వంతు మాత్రమే ఉన్నప్పటికీ, మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారులు ధరలు తగ్గించి కొనుగోలు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు అత్యధిక శాతం పంట ఉత్పత్తులను మార్కెట్ లోనే అమ్ముకోవాల్సిన పరిస్థితి కల్పిస్తే, ప్రైవేట్ వ్యాపారులు మరియు దళారులు నిర్ణయించిన తక్కువ ధరలకే రైతులు అమ్ముకొని నిలువునా మునిగిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.

మార్కెఫెడ్ ద్వారా బియ్యం విదేశీ ఎగుమతులు జరగాలి

తెలంగాణ రాష్ట్రం నుండి తమిళనాడు, కేరళ వంటి పొరుగు రాష్ట్రాలకే కాకుండా.. బంగ్లాదేశ్, మలేషియా, శ్రీలంక తదితర దేశాలకు సుమారు 35 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా బియ్యం ఎగుమతి అవుతోందని రామారావు ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు. మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్న, పెసలు, కందులు, సోయాబీన్ పంటలను కొనుగోలు చేస్తున్న తరహాలోనే, వరి ధాన్యాన్ని కూడా మార్కెఫెడ్ ద్వారానే నేరుగా సేకరించాలని కోరారు. అలా సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యంగా మార్చి, కేంద్ర ప్రభుత్వ అనుమతులతో ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే రాష్ట్ర రైతులకు ఎంతో మేలు జరుగుతుందని హితవు పలికారు.

రైతులకు ఇచ్చిన హామీల సాధన కోసం జేఏసీ నిర్వహించిన ‘రైతు సమర భేరి’ సభ నిర్వహణ కొంత ఆలస్యమైనప్పటికీ, రైతాంగాన్ని చైతన్యపరిచి పోరుబాట పట్టించడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ప్రతిపక్షాలను సైతం మొద్దు నిద్ర నుండి మేల్కొలిపింది రైతు జేఏసీయేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతు సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో పాలకులకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఇచ్చిన హామీలన్నీ క్షేత్రస్థాయిలో అమలు చేసే వరకు జేఏసీ తరపున పోరాటాలు ఆపబోమని, రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని రామారావు భరోసా ఇచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో బహుజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కన్నం లక్ష్మణ్, ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు కల్లెపెల్లి రాజేందర్, జంపాల నర్సయ్య, అండెం రమణారెడ్డి, కొత్తకొండ రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..