కరీంనగర్ వేదికగా ‘రైతు మహాగర్జన’.. 28న 2 లక్షల మందితో సమరభేరి! – ప్రభుత్వ వైఫల్యాలపై రైతు ప్రజాసంఘాల జేఏసీ యుద్ధప్రకటన – గోడప్రతులను ఆవిష్కరించిన మాజీ మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్.

బాహు బలంన్యూస్ హైదరాబాద్ ఏప్రిల్ 03 : అన్నదాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పాలకుల కళ్ళు తెరిపించేందుకు ఈనెల 28వ తేదీన కరీంనగర్ వేదికగా 2 లక్షల మందితో ‘రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన సమరభేరి’ సభను నిర్వహిస్తున్నట్లు రైతు ప్రజాసంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామి రెడ్డి ప్రకటించారు.
శుక్రవారం హైదరాబాద్‌లో ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల నాయకులతో కలిసి వారు మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, వి. శ్రీనివాస్ గౌడ్, సుద్దాల దేవయ్య, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మరియు ఇతర మాజీ ప్రజాప్రతినిధులను కలిశారు. ఈ సందర్భంగా సభకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను వారికి అందజేసి, సభ గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, తాము స్వయంగా సభకు హాజరవుతామని మాజీ మంత్రులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
రైతులకు మొండిచేయి.. 12 డిమాండ్లతో పోరుబాట.
ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చేముందు రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ముఖ్యంగా కౌలు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేదని ఆరోపించారు. రూ. 2 లక్షల రుణమాఫీ ప్రక్రియలో కేవలం 30 శాతం మందికే లబ్ధి చేకూరిందని, మిగిలిన 70 శాతం మంది రైతులు నేటికీ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధాన డిమాండ్లు ఇవే.
రుణమాఫీ: మిగిలిపోయిన 70 శాతం మంది రైతులకు తక్షణమే ఏకకాలంలో రుణమాఫీ పూర్తి చేయాలి.
రైతు భరోసా: సాగు సీజన్ ముగిసిపోతున్నా పెట్టుబడి సాయం అందలేదు, వెంటనే రైతు భరోసా నిధులను విడుదల చేయాలి.
బోనస్: కేవలం సన్న రకాలకే కాకుండా, అన్ని రకాల పంటలకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ చెల్లించాలి.
పాల రైతులకు ఊరట: గత ప్రభుత్వం ఇచ్చిన లీటరుకు రూ. 4 రాయితీని పునరుద్ధరించాలి.
కౌలు రైతులు: కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, ప్రభుత్వ పథకాలు వారికి వర్తింపజేయాలి.
రాజకీయాలకు అతీతంగా సంఘటితం.
ఈ సమరభేరి సభను ఎటువంటి రాజకీయ రంగు లేకుండా, కేవలం రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పాలకుల నిర్లక్ష్య ధోరణి వల్ల అన్నదాతలు ఆత్మహత్యల వైపు వెళ్లకుండా, వారిలో ధైర్యాన్ని నింపడమే ఈ మహాసభ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు ప్రజాసంఘాల నాయకులు నదిపెల్లి వెంకటేశ్వర్ రావు, హంస కేతన్ రెడ్డి, చకిలం రమణయ్య, వన్నాల విష్ణు వర్ధన్ రెడ్డి, నరేష్ యాదవ్, మంద గల్ల నగేష్, కవ్వంపల్లి అనిల్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !