రైతు హామీలను పడకేసిన రేవంత్ సర్కార్: రైతు ప్రజాసంఘాల సమాఖ్య ధ్వజం. రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు,

బాహు బలంన్యూస్ కరీంనగర్, మార్చి 21:
తమది రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి సర్కార్, క్షేత్రస్థాయిలో అన్నదాతలను ఆదుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ఉపాధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి ఆరోపించారు. శనివారం కరీంనగర్‌లోని ఒక హోటల్‌లో ఉమ్మడి జిల్లా రైతు ప్రజాసంఘాల నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైతులకు ఇచ్చిన చాలా హామీలను కనీసం ప్రస్తావించలేదని వారు మండిపడ్డారు.
బడ్జెట్‌లో రైతాంగానికి మొండిచేయి
కౌలు రైతులకు సాగు సాయం అందిస్తామని నమ్మబలికిన ప్రభుత్వం, తాజా బడ్జెట్‌లో వారి ఊసే ఎత్తలేదని రామారావు, రాంరెడ్డి విమర్శించారు. రూ. 2 లక్షల పూర్తి స్థాయి రుణమాఫీకి అవసరమైన నిధుల కేటాయింపుపై స్పష్టత లేదని, అన్ని రకాల వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇస్తామని ఎన్నికల సమయంలో మాటిచ్చి, ఇప్పుడు కేవలం సన్న రకాలకే పరిమితం చేయడం రైతుల్ని వంచించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడు విడతలుగా రైతు భరోసా నిధులను పక్కదారి పట్టించి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని వారు ఘాటుగా విమర్శించారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినా దానికి నిధులు ఇవ్వకుండా, పాలక మండలిని నియమించకుండా రేవంత్ సర్కార్ కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు.
ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’
ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్ 28న కరీంనగర్‌లో లక్ష మందితో ‘రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన సమర భేరి’ సభను నిర్వహించనున్నట్లు వారు ప్రకటించారు. ఈ లోగా ఓసి జేఏసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి భారీ ర్యాలీ చేపడతామని హెచ్చరించారు. రైతు పండించిన పంటలకు క్వింటాల్‌కు రూ. 3,000 చెల్లించాలని, రైతు బీమా వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచాలని, 50 ఏళ్లు నిండిన రైతులకు నెలకు రూ. 6,000 పెన్షన్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓసి జేఏసీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జూన్నూతుల రాజిరెడ్డి, ఏనుగు చొక్కా రెడ్డి, దడిగల వెంకటేశ్వర్ రావు, అయిత నాగరాజు తదితర నాయకులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..