రైతు ప్రయోజనాలను విస్మరిస్తే ప్రభుత్వాలకు ముప్పు: పోలాడి రామారావు, సంది తిరుపతి రెడ్డి హెచ్చరిక.

bahubalamtv Reporter
bahubalamtv.in

రైతు ప్రయోజనాలను విస్మరిస్తే ప్రభుత్వాలకు ముప్పు: పోలాడి రామారావు, సంది తిరుపతి రెడ్డి హెచ్చరిక.

బాహు బలంన్యూస్ కరీంనగర్, మార్చి 17: అన్నదాతల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తూ, ఎన్నికల హామీలను తుంగలో తొక్కితే ప్రభుత్వాలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ఓసీ ఐకాస జాతీయ ప్రధాన కార్యదర్శి సంది తిరుపతి రెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మంగళవారం కరీంనగర్‌లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 28న నిర్వహించ తలపెట్టిన 'రైతు మహాగర్జన సమరభేరి' పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఏప్రిల్ 28న 'లక్ష' మందితో రైతు మహాగర్జన
రైతుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఉద్యమ తరహాలో ఉధృత పోరాటం చేస్తామని నేతలు ప్రకటించారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 28న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో లక్ష మందితో రాష్ట్ర స్థాయి బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే 30 వేల మంది రైతులను తరలించాలని ఈ సందర్భంగా తీర్మానించారు.
ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తుతూ..
"ప్రజా సంక్షేమమే లక్ష్యమని చెప్పుకుంటున్న పాలకులు, దేశానికి అన్నం పెట్టే రైతులకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదు?" అని వారు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం తప్ప, క్షేత్రస్థాయిలో వారిని ఆదుకోవడంలో విఫలమైందని విమర్శించారు. కనీసం ప్రాజెక్టుల నుండి నీటిని ఎలా విడుదల చేయాలి, వాటర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలనే కనీస అవగాహన కూడా పాలకులకు లేకపోవడం దారుణమన్నారు.
ప్రధాన డిమాండ్లు ఇవే:
గిట్టుబాటు ధర చట్టం: రైతులు పండించిన పంటలకు రైతులే ధర నిర్ణయించుకునేలా జాతీయ స్థాయిలో ప్రత్యేక చట్టం తీసుకురావాలి. ఎకరాకు రూ. 3,000 అదనపు గిట్టుబాటు ధర కల్పించాలి.
ఉపాధి హామీ అనుసంధానం: వ్యవసాయ రంగంలో కూలీల కొరతను అధిగమించేందుకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తక్షణమే వ్యవసాయంతో అనుసంధానం చేయాలి.
భరోసా నిధులు: పంట సాగు సమయం ముగియక ముందే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలి.
పింఛను & బీమా: 50 ఏళ్లు నిండిన రైతులకు నెలకు రూ. 6,000 పింఛను ఇవ్వాలి. రైతు బీమా వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచడంతో పాటు, రైతు కుటుంబాలకు రూ. 20 లక్షల ఉచిత వైద్యం అందించాలి.

ఓసీ కార్పొరేషన్లు: ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదల కోసం జాతీయ స్థాయి ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలోని వివిధ ఓసీ కార్పొరేషన్లకు తక్షణమే నిధులు విడుదల చేసి, పాలకమండళ్లను నియమించాలి.

ఐకాస నేతగా సంది తిరుపతి రెడ్డి ఎన్నిక.
ఈ సమావేశంలో ఓసీ జేఏసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సంది తిరుపతి రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పోలాడి రామారావు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఐకాస జాతీయ సలహాదారు పెండ్యాల కేశవరెడ్డి, ఉత్తర తెలంగాణ అధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జున్నూతుల రాజిరెడ్డి, ఆర్యవైశ్య జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అయిత నాగరాజు, రెడ్డి జేఏసీ కన్వీనర్ బండ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. https://youtu.be/wUuHsG7d6KY?si=ma6pJ_4ccs6Wgs5T

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ కరీంనగర్, మార్చి 17: అన్నదాతల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తూ, ఎన్నికల హామీలను తుంగలో తొక్కితే ప్రభుత్వాలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ఓసీ ఐకాస జాతీయ ప్రధాన కార్యదర్శి సంది తిరుపతి రెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మంగళవారం కరీంనగర్‌లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 28న నిర్వహించ తలపెట్టిన ‘రైతు మహాగర్జన సమరభేరి’ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఏప్రిల్ 28న ‘లక్ష’ మందితో రైతు మహాగర్జన
రైతుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఉద్యమ తరహాలో ఉధృత పోరాటం చేస్తామని నేతలు ప్రకటించారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 28న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో లక్ష మందితో రాష్ట్ర స్థాయి బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే 30 వేల మంది రైతులను తరలించాలని ఈ సందర్భంగా తీర్మానించారు.
ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తుతూ..
“ప్రజా సంక్షేమమే లక్ష్యమని చెప్పుకుంటున్న పాలకులు, దేశానికి అన్నం పెట్టే రైతులకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదు?” అని వారు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం తప్ప, క్షేత్రస్థాయిలో వారిని ఆదుకోవడంలో విఫలమైందని విమర్శించారు. కనీసం ప్రాజెక్టుల నుండి నీటిని ఎలా విడుదల చేయాలి, వాటర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలనే కనీస అవగాహన కూడా పాలకులకు లేకపోవడం దారుణమన్నారు.
ప్రధాన డిమాండ్లు ఇవే:
గిట్టుబాటు ధర చట్టం: రైతులు పండించిన పంటలకు రైతులే ధర నిర్ణయించుకునేలా జాతీయ స్థాయిలో ప్రత్యేక చట్టం తీసుకురావాలి. ఎకరాకు రూ. 3,000 అదనపు గిట్టుబాటు ధర కల్పించాలి.
ఉపాధి హామీ అనుసంధానం: వ్యవసాయ రంగంలో కూలీల కొరతను అధిగమించేందుకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తక్షణమే వ్యవసాయంతో అనుసంధానం చేయాలి.
భరోసా నిధులు: పంట సాగు సమయం ముగియక ముందే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలి.
పింఛను & బీమా: 50 ఏళ్లు నిండిన రైతులకు నెలకు రూ. 6,000 పింఛను ఇవ్వాలి. రైతు బీమా వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచడంతో పాటు, రైతు కుటుంబాలకు రూ. 20 లక్షల ఉచిత వైద్యం అందించాలి.

ఓసీ కార్పొరేషన్లు: ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదల కోసం జాతీయ స్థాయి ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలోని వివిధ ఓసీ కార్పొరేషన్లకు తక్షణమే నిధులు విడుదల చేసి, పాలకమండళ్లను నియమించాలి.

ఐకాస నేతగా సంది తిరుపతి రెడ్డి ఎన్నిక.
ఈ సమావేశంలో ఓసీ జేఏసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సంది తిరుపతి రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పోలాడి రామారావు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఐకాస జాతీయ సలహాదారు పెండ్యాల కేశవరెడ్డి, ఉత్తర తెలంగాణ అధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జున్నూతుల రాజిరెడ్డి, ఆర్యవైశ్య జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అయిత నాగరాజు, రెడ్డి జేఏసీ కన్వీనర్ బండ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. https://youtu.be/wUuHsG7d6KY?si=ma6pJ_4ccs6Wgs5T

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !