పట్టణంలోని 29వ వార్డులో అంగన్‌వాడీ, పాఠశాలను సందర్శించిన మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని వార్డు కౌన్సిలర్ బోరగాల మొగిలి .

bahubalamtv Reporter
bahubalamtv.in

పట్టణంలోని 29వ వార్డులో అంగన్‌వాడీ, పాఠశాలను సందర్శించిన మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని వార్డు కౌన్సిలర్ బోరగాల మొగిలి .

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ మార్చి13 : పట్టణంలోని 29వ వార్డులో మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహసిని మరియు వార్డు కౌన్సిలర్ బోరగాల మొగిలి శుక్ర వారం పర్యటించారు. వార్డు పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని మరియు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను వారు సందర్శించి, అక్కడ అందుతున్న సేవలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ముందుగా అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన చైర్‌పర్సన్, కేంద్రంలోని వంటగదిని మరియు నిల్వ ఉంచిన సరుకులను తనిఖీ చేశారు. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు మరియు చిన్న పిల్లలకు ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం పౌష్టికాహారం సక్రమంగా అందుతుందో లేదో లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. "చిన్నారుల ఆరోగ్యం విషయంలో రాజీ పడకూడదని, ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని" ఆమె ఈ సందర్భంగా సిబ్బందికి సూచించారు.
అనంతరం స్థానిక ప్రాథమిక పాఠశాలను సందర్శించి, విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. వంటశాల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని వడ్డించాలని వంట మనుషులకు దిశానిర్దేశం చేశారు. ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థుల విద్యా ప్రమాణాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బోరగాల కవిత, స్వర్ణలత, అంగన్‌వాడీ సూపర్వైజర్, టీచర్ రొంటాల పద్మ, ఆర్పీలు బోరగాల రమ, ఎర్ర వినోద, ఆశా వర్కర్ వసంత తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ మార్చి13 : పట్టణంలోని 29వ వార్డులో మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహసిని మరియు వార్డు కౌన్సిలర్ బోరగాల మొగిలి శుక్ర వారం పర్యటించారు. వార్డు పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని మరియు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను వారు సందర్శించి, అక్కడ అందుతున్న సేవలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ముందుగా అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన చైర్‌పర్సన్, కేంద్రంలోని వంటగదిని మరియు నిల్వ ఉంచిన సరుకులను తనిఖీ చేశారు. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు మరియు చిన్న పిల్లలకు ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం పౌష్టికాహారం సక్రమంగా అందుతుందో లేదో లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. “చిన్నారుల ఆరోగ్యం విషయంలో రాజీ పడకూడదని, ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని” ఆమె ఈ సందర్భంగా సిబ్బందికి సూచించారు.
అనంతరం స్థానిక ప్రాథమిక పాఠశాలను సందర్శించి, విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. వంటశాల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని వడ్డించాలని వంట మనుషులకు దిశానిర్దేశం చేశారు. ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థుల విద్యా ప్రమాణాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బోరగాల కవిత, స్వర్ణలత, అంగన్‌వాడీ సూపర్వైజర్, టీచర్ రొంటాల పద్మ, ఆర్పీలు బోరగాల రమ, ఎర్ర వినోద, ఆశా వర్కర్ వసంత తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !