అభివృద్ధి ధ్యేయంగా కూతాడి కుమారస్వామి ఎన్నికల ప్రచారం.

bahubalamtv Reporter
bahubalamtv.in

అభివృద్ధి ధ్యేయంగా కూతాడి కుమారస్వామి ఎన్నికల ప్రచారం.

హుజూరాబాద్, ఫిబ్రవరి 04 (బాహుబలం న్యూస్): హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వంలో 15వ వార్డు బీజేపీ అభ్యర్థి కూతాడి కుమారస్వామి తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బుధవారం వార్డులో నిర్వహించిన భారీ ప్రచార కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని కుమారస్వామికి మద్దతుగా ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా కూతాడి కుమారస్వామి ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తనకు ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే వార్డులో ఉన్న డ్రైనేజీ, తాగునీరు, రోడ్ల వంటి అన్ని సమస్యలను పరిష్కరించి, వార్డును సమస్యల రహితంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అనాదిగా రాజకీయ ప్రాతినిధ్యానికి దూరంగా ఉన్న ఎరుకల సామాజిక వర్గం నుంచి మున్సిపల్ చరిత్రలోనే తొలిసారిగా ఒక అభ్యర్థి పోటీకి దిగడం ఆత్మగౌరవ పోరాటమని ఆయన పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, సామాజిక స్పృహ కలిగిన కుమారస్వామి వంటి నాయకుడిని గెలిపించుకోవడం ద్వారా వార్డు అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. అట్టడుగు వర్గాలకు రాజకీయ గుర్తింపు దక్కాలనే లక్ష్యంతో బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని, ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు మరియు ఎరుకల సంఘం ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !