నన్ను ఆశీర్వదించండి.. మీ సేవకురాలిగా అవకాశమివ్వండి: కాంగ్రెస్ అభ్యర్థి రోంటాల సుహాసిని విన్నపం.

bahubalamtv Reporter
bahubalamtv.in

నన్ను ఆశీర్వదించండి.. మీ సేవకురాలిగా అవకాశమివ్వండి: కాంగ్రెస్ అభ్యర్థి రోంటాల సుహాసిని విన్నపం.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ఫిబ్రవరి 04 : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజురాబాద్ పట్టణంలోని 30వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి రోంటాల సుహాసిని బుధవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ నెల 11న జరగనున్న ఎన్నికలను పురస్కరించుకుని, వార్డు పరిధిలోని విద్యానగర్, గాంధీనగర్ మాతృశ్రీ డిగ్రీ కళాశాల వెనుక ఉన్న కాలనీల్లో ఆమె ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు. మహిళా ఓటర్లు ఆమెకు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రోంటాల సుహాసిని మాట్లాడుతూ.. వార్డు ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించే బాధ్యత గల అభ్యర్థిగా తాను బరిలో ఉన్నట్లు తెలిపారు. సేవే తన సిద్ధాంతమని, నిబద్ధతతో కూడిన విలువలతో ప్రజల ముందుకు వస్తున్నానని చెప్పారు. "నేను మీ మధ్యనే నివసించే మీ ఇంటి ఆడబిడ్డను. మీ సమస్యలు నాకు క్షుణ్ణంగా తెలుసు. వాటిని పరిష్కరించే శక్తి, మార్గం కూడా నాకు తెలుసు. 24 గంటలు మీకు అందుబాటులో ఉంటూ, మీ గొంతుకగా నిలబడేందుకు మీ సేవకురాలిగా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి" అని ఆమె విజ్ఞప్తి చేశారు.
గత కాలంగా వార్డులో అపరిష్కృతంగా ఉన్న తాగునీటి ఎద్దడి, డ్రైనేజీ సమస్యలు, రోడ్ల దుస్థితి మరియు పారిశుధ్య లోపాలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడమే తన లక్ష్యమని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల భద్రతకు, పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందనీ, వార్డు అభివృద్ధి కోసం కేటాయించే ప్రతి పైసాను అత్యంత పారదర్శకంగా ఖర్చు చేసి, వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ తోట రాజేంద్రప్రసాద్, కేసరి మధుకర్ రావు, దిల్ శ్రీనివాస్, ఎర్ర కుమార స్వామి, రేణిగుంట్ల సందీప్, చిట్యాల రేవంత్, మొలుగూరి రాధా తదితరులు పాల్గొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ఫిబ్రవరి 04 : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజురాబాద్ పట్టణంలోని 30వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి రోంటాల సుహాసిని బుధవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ నెల 11న జరగనున్న ఎన్నికలను పురస్కరించుకుని, వార్డు పరిధిలోని విద్యానగర్, గాంధీనగర్ మాతృశ్రీ డిగ్రీ కళాశాల వెనుక ఉన్న కాలనీల్లో ఆమె ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు. మహిళా ఓటర్లు ఆమెకు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రోంటాల సుహాసిని మాట్లాడుతూ.. వార్డు ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబించే బాధ్యత గల అభ్యర్థిగా తాను బరిలో ఉన్నట్లు తెలిపారు. సేవే తన సిద్ధాంతమని, నిబద్ధతతో కూడిన విలువలతో ప్రజల ముందుకు వస్తున్నానని చెప్పారు. “నేను మీ మధ్యనే నివసించే మీ ఇంటి ఆడబిడ్డను. మీ సమస్యలు నాకు క్షుణ్ణంగా తెలుసు. వాటిని పరిష్కరించే శక్తి, మార్గం కూడా నాకు తెలుసు. 24 గంటలు మీకు అందుబాటులో ఉంటూ, మీ గొంతుకగా నిలబడేందుకు మీ సేవకురాలిగా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి” అని ఆమె విజ్ఞప్తి చేశారు.
గత కాలంగా వార్డులో అపరిష్కృతంగా ఉన్న తాగునీటి ఎద్దడి, డ్రైనేజీ సమస్యలు, రోడ్ల దుస్థితి మరియు పారిశుధ్య లోపాలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడమే తన లక్ష్యమని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల భద్రతకు, పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందనీ, వార్డు అభివృద్ధి కోసం కేటాయించే ప్రతి పైసాను అత్యంత పారదర్శకంగా ఖర్చు చేసి, వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ తోట రాజేంద్రప్రసాద్, కేసరి మధుకర్ రావు, దిల్ శ్రీనివాస్, ఎర్ర కుమార స్వామి, రేణిగుంట్ల సందీప్, చిట్యాల రేవంత్, మొలుగూరి రాధా తదితరులు పాల్గొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !