క్రీడలతోనే బంగారు భవిష్యత్తు: సర్పంచ్ వంతడుపుల కస్తూరి

bahubalamtv Reporter
bahubalamtv.in

క్రీడలతోనే బంగారు భవిష్యత్తు: సర్పంచ్ వంతడుపుల కస్తూరి

హుజురాబాద్ బాహు బలంన్యూస్ హుజూరాబాద్ జనవరి 22: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెల్పూర్ గ్రామ సర్పంచ్ మరియు క్రీడోత్సవాల కమిటీ చైర్మన్ వంతడుపుల కస్తూరి పిలుపునిచ్చారు. గురువారం చెల్పూర్ గ్రామంలో క్లస్టర్ లెవెల్ (చెల్పూర్, రాంపూర్, రాజపల్లి, శాల్లపల్లి, ఇందిరానగర్) సీఎం కప్ రెండవ ఎడిషన్ క్రీడోత్సవాలను ఆమె ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనస్సు ఉంటుందని, క్రీడల వల్ల ఏకాగ్రత, క్రమశిక్షణ మరియు నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని విద్యార్థులకు వివరించారు. విద్యార్థి దశ నుండే క్రీడల పట్ల మక్కువ పెంచుకుని జిల్లా, రాష్ట్ర మరియు అంతర్జాతీయ స్థాయిల్లో రాణించి గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
నేటి యువత డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండి, క్రీడలకు బానిసలుగా మారి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆమె హితవు పలికారు. తల్లిదండ్రుల, గురువుల ఆశయాలను నెరవేరుస్తూ దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. గ్రామంలో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, మాజీ సర్పంచ్ పొలంపల్లి శ్రీనివాస్ రెడ్డి, గ్రామ కార్యదర్శి జయేందర్, ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్, వార్డు సభ్యులు పంజాల జ్యోతి, ఎండి రహీం, పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !