కాట్రపల్లిలో ఉచిత పశువైద్య శిబిరం: 125 పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్సలు.

bahubalamtv Reporter
bahubalamtv.in

కాట్రపల్లిలో ఉచిత పశువైద్య శిబిరం: 125 పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్సలు.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, జనవరి 27:
హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామంలో మంగళవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య ఆరోగ్య మరియు పునరుత్పత్తి శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ పశుగణాభివృద్ధి వ్యవస్థలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ శ్రీమతి పెరుమాండ్ల హైమా బిక్షపతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలోని పాడి రైతులు తమ పశువుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం అందిస్తున్న ఇలాంటి ఉచిత వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకొని గ్రామంలో పాల ఉత్పత్తిని పెంపొందించాలని కోరారు. అనంతరం సింగపూర్ పశువైద్యాధికారి డాక్టర్ పి. రవీందర్ రెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పశువులలో వచ్చే గర్భకోశ సమస్యల వల్ల పునరుత్పత్తి సామర్థ్యం తగ్గి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని, శాస్త్రీయ పద్ధతులలో పశువులను పోషించడం ద్వారా పాడి పరిశ్రమను లాభసాటిగా మార్చుకోవచ్చని సూచించారు.
ఈ శిబిరంలో సుమారు 125 పాడి పశువులకు గర్భకోశ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, వాటికి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. పునరుత్పత్తి సమస్యలతో బాధపడుతున్న పశువులకు ప్రత్యేక చికిత్సలు అందించారు. ఈ కార్యక్రమంలో చెల్పూర్ పశువైద్యాధికారి డాక్టర్ రాజేష్, జమ్మికుంట పశువైద్యాధికారి రాజ్ కుమార్, గ్రామ ఉపసర్పంచ్ గంగాదారి బిక్షపతి, గోపాల మిత్ర సూపర్వైజర్ రామ్ రెడ్డి, గోపాల మిత్రులు పెరుమాళ్ళ రవీందర్, రమేష్ మరియు గ్రామంలోని అధిక సంఖ్యలో రైతులు తమ పశువులతో హాజరై శిబిరాన్ని విజయవంతం చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !