హుజూరాబాద్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరవేస్తాం: పల్లెని దేవేందర్ రావు

bahubalamtv Reporter
bahubalamtv.in

హుజూరాబాద్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరవేస్తాం: పల్లెని దేవేందర్ రావు

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, జనవరి 12: హుజూరాబాద్ మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతోందని, రాబోయే ఎన్నికల్లో మున్సిపల్ పీఠంపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ సీనియర్ నాయకులు పల్లెని దేవేందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గత పాలకుల నిర్లక్ష్యంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వనరులు ఉన్నప్పటికీ హుజూరాబాద్‌ను అభివృద్ధి చేయడంలో గత పాలకులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
పట్టణ అభివృద్ధి కోసం తన కార్యాచరణను ప్రకటిస్తూ.. స్థానిక మోడల్ చెరువును 'ట్యాంక్ బండ్' తరహాలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. పట్టణంలో ప్రధాన సమస్యలైన కోతుల బెడదను అరికడతామని, డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని పేర్కొన్నారు. యువత కోసం మినీ స్టేడియం, అత్యాధునిక డిజిటల్ గ్రంథాలయం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ప్రతి నెలా వార్డుల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని వెల్లడించారు. పార్టీ ఆదేశిస్తే 28వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుస్తానని దేవేందర్ రావు స్పష్టం చేశారు. హుజూరాబాద్ అభివృద్ధి కోసం ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని ఆయన పిలుపునిచ్చారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, జనవరి 12: హుజూరాబాద్ మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతోందని, రాబోయే ఎన్నికల్లో మున్సిపల్ పీఠంపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ సీనియర్ నాయకులు పల్లెని దేవేందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గత పాలకుల నిర్లక్ష్యంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వనరులు ఉన్నప్పటికీ హుజూరాబాద్‌ను అభివృద్ధి చేయడంలో గత పాలకులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
పట్టణ అభివృద్ధి కోసం తన కార్యాచరణను ప్రకటిస్తూ.. స్థానిక మోడల్ చెరువును ‘ట్యాంక్ బండ్’ తరహాలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. పట్టణంలో ప్రధాన సమస్యలైన కోతుల బెడదను అరికడతామని, డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని పేర్కొన్నారు. యువత కోసం మినీ స్టేడియం, అత్యాధునిక డిజిటల్ గ్రంథాలయం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ప్రతి నెలా వార్డుల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని వెల్లడించారు. పార్టీ ఆదేశిస్తే 28వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుస్తానని దేవేందర్ రావు స్పష్టం చేశారు. హుజూరాబాద్ అభివృద్ధి కోసం ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని ఆయన పిలుపునిచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !