ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికైన వన్నాల శివాజీకి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఘన సన్మానం.

బాహుబలం న్యూస్
bahubalamtv.in

ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికైన వన్నాల శివాజీకి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఘన సన్మానం.

10 Jan 2026, 7:40 pm BAHUBALAM NEWS

బాహు బలంన్యూస్ హుజురాబాద్, జనవరి 10: హుజురాబాద్ మండల ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన వన్నాల శివాజీకి హుజురాబాద్ పట్టణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా రాంపూర్ గ్రామ ఉపసర్పంచ్‌గా గెలుపొంది, అనంతరం మండల ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, పట్టణ అధ్యక్షుడు సందేల వెంకన్న ఆధ్వర్యంలో శివాజీని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ.. వన్నాల శివాజీ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుంటూ, గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి నిరంతరం సేవలు అందించాలని వారు కోరారు. ప్రజా ఆదరాభిమానాలను చూరగొంటూ నియోజకవర్గ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని హితవు పలికారు. సన్మాన గ్రహీత శివాజీ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని, ఉపసర్పంచులందరినీ సమన్వయం చేసుకుంటూ మండల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ సన్మాన కార్యక్రమంలో వేముల అశోక్ (షార్ట్ ఫిలిం ప్రొడ్యూసర్ మరియు ఏఎంసి డైరెక్టర్), మాజీ కౌన్సిలర్ కేసిరెడ్డి నరసింహారెడ్డి, పూలే కమిటీ అధ్యక్షుడు ఇప్పలపల్లి చంద్రశేఖర్, బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్, బండారి సదానందం, వడ్లకొండ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, గరవేణి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

bahubalamtv Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !