సీనియర్ జర్నలిస్ట్ మండల యాదగిరికి ‘రాష్ట్రస్థాయి సర్వోత్తమ సేవా పురస్కారం’

హుజురాబాద్ బాహు బలంన్యూస్ జనవరి 12
కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ మండల యాదగిరి పత్రికా రంగంలో గత 30 ఏళ్లుగా అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా ‘రాష్ట్రస్థాయి సర్వోత్తమ సేవా పురస్కారం’ లభించింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో మానవ విలువల పరిరక్షణ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, అంతర్జాతీయ భారత్ వరల్డ్ రికార్డ్ గ్రహీత కదరి వెంకటరమణరావు తదితర ప్రముఖులు యాదగిరిని శాలువాతో సత్కరించి, అవార్డును ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. యాదగిరి సమాజ శ్రేయస్సే లక్ష్యంగా ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని నిస్వార్థంగా సేవలందిస్తున్నారని కొనియాడారు. ఆయన సేవలు సమాజానికి ఆదర్శప్రాయమని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఇదే క్రమంలో 25 ఏళ్లకు పైగా పత్రికా రంగంలో కొనసాగుతున్న జర్నలిస్టులకు ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం, జీవనోపాధి కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు నాగుల సత్యం గౌడ్, డాక్టర్ శివ నాగార్జున రెడ్డి, నటి ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !