హుజూరాబాద్‌లో ‘క్యాప్రి గ్లోబల్ గోల్డ్ లోన్స్’ నూతన బ్రాంచ్ ప్రారంభం: తక్కువ వడ్డీకే బంగారు ఆభరణాలపై రుణాలు

bahubalamtv Reporter
bahubalamtv.in

హుజూరాబాద్‌లో ‘క్యాప్రి గ్లోబల్ గోల్డ్ లోన్స్’ నూతన బ్రాంచ్ ప్రారంభం: తక్కువ వడ్డీకే బంగారు ఆభరణాలపై రుణాలు

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, డిసెంబర్ 29:
హుజూరాబాద్ పట్టణ కేంద్రంలో ప్రముఖ ఆర్థిక సంస్థ 'క్యాప్రి గ్లోబల్ గోల్డ్ లోన్స్ ప్రైవేట్ లిమిటెడ్' తన నూతన బ్రాంచ్‌ను సోమవారం ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ గందె రాధిక రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. బ్రాంచ్ మేనేజర్ మొలుగూరి సుమన్ అధ్యక్షతన జరిగిన ఈ ప్రారంభోత్సవంలో వేద పండితులు తిరుమలాచార్యులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మేనేజర్ సుమన్ సంస్థ కార్యకలాపాలను అధికారికంగా అందుబాటులోకి తెస్తూ నూతన ఖాతాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా గందె రాధిక మాట్లాడుతూ, పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంతాల వారికి అత్యవసర ఆర్థిక అవసరాల కోసం ఈ సంస్థ అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. వినియోగదారులు తమ బంగారు ఆభరణాలపై సురక్షితంగా, తక్కువ వడ్డీకే రుణాలు పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం బ్రాంచ్ మేనేజర్ సుమన్ సంస్థ సేవల గురించి వివరిస్తూ, వినియోగదారులకు అతి తక్కువ వడ్డీ రేట్లతో పాటు, బంగారు ఆభరణాల విలువపై 95 శాతానికి పైగా గరిష్ట రుణాన్ని అందజేస్తామని వెల్లడించారు. ఎటువంటి దాపరికం లేని పారదర్శకమైన లావాదేవీలు, తక్కువ కాగితపు పనితో నిమిషాల వ్యవధిలోనే రుణాలు మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ అజయ్, రిలేషన్ షిప్ మేనేజర్ పవన్ కళ్యాణ్, ఏరియా మేనేజర్ షేక్ సల్మాన్, క్యాప్రి గ్లోబల్ సిబ్బంది, ఇతర అధికారులు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, డిసెంబర్ 29:
హుజూరాబాద్ పట్టణ కేంద్రంలో ప్రముఖ ఆర్థిక సంస్థ ‘క్యాప్రి గ్లోబల్ గోల్డ్ లోన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ తన నూతన బ్రాంచ్‌ను సోమవారం ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ గందె రాధిక రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. బ్రాంచ్ మేనేజర్ మొలుగూరి సుమన్ అధ్యక్షతన జరిగిన ఈ ప్రారంభోత్సవంలో వేద పండితులు తిరుమలాచార్యులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మేనేజర్ సుమన్ సంస్థ కార్యకలాపాలను అధికారికంగా అందుబాటులోకి తెస్తూ నూతన ఖాతాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా గందె రాధిక మాట్లాడుతూ, పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంతాల వారికి అత్యవసర ఆర్థిక అవసరాల కోసం ఈ సంస్థ అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. వినియోగదారులు తమ బంగారు ఆభరణాలపై సురక్షితంగా, తక్కువ వడ్డీకే రుణాలు పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం బ్రాంచ్ మేనేజర్ సుమన్ సంస్థ సేవల గురించి వివరిస్తూ, వినియోగదారులకు అతి తక్కువ వడ్డీ రేట్లతో పాటు, బంగారు ఆభరణాల విలువపై 95 శాతానికి పైగా గరిష్ట రుణాన్ని అందజేస్తామని వెల్లడించారు. ఎటువంటి దాపరికం లేని పారదర్శకమైన లావాదేవీలు, తక్కువ కాగితపు పనితో నిమిషాల వ్యవధిలోనే రుణాలు మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ అజయ్, రిలేషన్ షిప్ మేనేజర్ పవన్ కళ్యాణ్, ఏరియా మేనేజర్ షేక్ సల్మాన్, క్యాప్రి గ్లోబల్ సిబ్బంది, ఇతర అధికారులు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !