శిథిలమైన బ్రిడ్జిపైనే నిద్రిస్తాం: టీజేఎస్ జిల్లా అధ్యక్షులు మోరె గణేష్

బాహు బలంన్యూస్ కేశపట్నం డిసెంబర్ 27,:
మొలంగూర్ గ్రామం నుండి చెమిలాడ బోడుకు వెళ్లే దారిలో గల బ్రిడ్జి పూర్తిగా శిథిలావస్థకు చేరిందని, తక్షణమే నూతన బ్రిడ్జిని నిర్మించకపోతే గ్రామస్తులతో కలిసి బ్రిడ్జిపైనే నిద్రించి నిరసన తెలుపుతామని తెలంగాణ జన సమితి (టీజేఎస్) పార్టీ జిల్లా అధ్యక్షులు మోరె గణేష్ హెచ్చరించారు. శనివారం ఆయన స్థానికులతో కలిసి ప్రమాదకరంగా మారిన బ్రిడ్జిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ బ్రిడ్జి గుండా నిత్యం వందలాది ఎకరాలకు సంబంధించి రైతులు తమ సాగు పనుల కోసం వాహనాల్లో రాకపోకలు సాగిస్తుంటారని తెలిపారు. ప్రస్తుతం బ్రిడ్జిపై భారీ గుంతలు ఏర్పడి, పిల్లర్లు నెర్రెలు చాచి ఏ క్షణమైనా కూలిపోయే స్థితిలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిడ్జికి ఇరువైపులా కనీసం రక్షణ గోడలు కూడా లేకపోవడంతో, వర్షాకాలంలో ప్రయాణం ప్రాణసంకటంగా మారుతోందని మండిపడ్డారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి నూతన బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం వహిస్తే రానున్న రోజుల్లో గ్రామ ప్రజలతో కలిసి బ్రిడ్జిపైనే వంటా-వార్పు కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దాసరపు ఆనంద్, దాసరపు శివ సాయి, మోరే అజయ్, మహిళలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !