విద్యార్థులకు ‘జయన్న ఫౌండేషన్’ చేయూత: కందుగుల పాఠశాలలకు లక్షతో మౌలిక వసతులు కల్పన

bahubalamtv Reporter
bahubalamtv.in

విద్యార్థులకు ‘జయన్న ఫౌండేషన్’ చేయూత: కందుగుల పాఠశాలలకు లక్షతో మౌలిక వసతులు కల్పన

బాహు బలంన్యూస్ హుజురాబాద్,నవంబర్ 22:
హుజురాబాద్ మండలం కందుగులలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) మరియు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 'జయన్న ఫౌండేషన్' లక్ష రూపాయల వ్యయంతో విశేష సాయం అందించింది. పాఠశాలల్లో అత్యవసరమైన మౌలిక వసతులు, ఇతర సామాగ్రిని సమకూర్చి, ఫౌండేషన్ తమ ఉదారతను చాటుకుంది.

తాగునీరు, పారిశుద్ధ్యానికి శాశ్వత పరిష్కారం

పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యకు ఫౌండేషన్ శాశ్వత పరిష్కారం చూపింది. కొత్తగా మోటారు, పైప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథ నీరు పై ట్యాంకుకు చేరేందుకు అవసరమైన సౌకర్యాన్ని కూడా కల్పించారు. అలాగే, మరుగుదొడ్లలో (బాత్రూమ్‌లలో) కొత్త ట్యాప్ కనెక్షన్లు ఇచ్చి, అవసరమైన మరమ్మతులను పూర్తి చేయించారు.

వస్తు సామగ్రి, బాలికలకు ప్రత్యేక కిట్లు పంపిణీ.

మౌలిక సదుపాయాలతో పాటు, ఫౌండేషన్ విద్యార్థుల కోసం ప్లేట్లు, గ్లాసులు బహూకరించింది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా ప్లేట్లు, కొత్త పలకలను అందించారు. ముఖ్యంగా, 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న బాలికల ఆరోగ్య అవసరాల నిమిత్తం వారికి శానిటరీ నాప్‌కిన్స్ కిట్‌లను పంపిణీ చేశారు.

విద్య, ఆరోగ్య సేవకు నిరంతర కృషి: జైపాల్ రెడ్డి.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 'జయన్న ఫౌండేషన్' ఛైర్మన్ గుడిపాటి సరిత- జైపాల్ రెడ్డి తమ సేవా దృక్పథాన్ని వెల్లడించారు. విద్య, ఆరోగ్య అభివృద్ధికి తమ సహాయాన్ని నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. పిల్లలకు సౌకర్యాలు కల్పించడం తమకు 'బిరియాని తిన్నంత' సంతోషాన్ని ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.

వైద్య సహాయానికి భరోసా.

గతంలో దాదాపు 1500 మంది గ్రామ ప్రజలకు హైదరాబాద్‌లోని శంకర కంటి వైద్యశాల ద్వారా ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్లు, లెన్సులు అమర్చిన విషయాన్ని జైపాల్ రెడ్డి గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా గాంధీ వైద్యశాల వంటి చోట్ల ఎలాంటి వైద్య సహాయం అవసరమైనా తమ సొంత ఖర్చులతో చేయిస్తానని హామీ ఇచ్చారు. సింగపూర్ గ్రామ ప్రజల కోసం ప్రత్యేకంగా అంబులెన్స్‌ను ఏర్పాటు చేసినట్లు, ప్రమాదాల సమయంలో హైదరాబాద్ వరకు ఉచితంగా తరలించే సౌకర్యం కల్పిస్తున్నామని ఆయన ప్రకటించారు. ప్రజలు తమ ఆరోగ్య సమస్యలను తెలియజేస్తే వెంటనే స్పందించి సహాయం చేస్తామని ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు కాసం రఘుపతి రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ బెల్లి రాజయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ ఇమ్మడి దయాకర్, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజురాబాద్,నవంబర్ 22:
హుజురాబాద్ మండలం కందుగులలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) మరియు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ‘జయన్న ఫౌండేషన్’ లక్ష రూపాయల వ్యయంతో విశేష సాయం అందించింది. పాఠశాలల్లో అత్యవసరమైన మౌలిక వసతులు, ఇతర సామాగ్రిని సమకూర్చి, ఫౌండేషన్ తమ ఉదారతను చాటుకుంది.

తాగునీరు, పారిశుద్ధ్యానికి శాశ్వత పరిష్కారం

పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యకు ఫౌండేషన్ శాశ్వత పరిష్కారం చూపింది. కొత్తగా మోటారు, పైప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథ నీరు పై ట్యాంకుకు చేరేందుకు అవసరమైన సౌకర్యాన్ని కూడా కల్పించారు. అలాగే, మరుగుదొడ్లలో (బాత్రూమ్‌లలో) కొత్త ట్యాప్ కనెక్షన్లు ఇచ్చి, అవసరమైన మరమ్మతులను పూర్తి చేయించారు.

వస్తు సామగ్రి, బాలికలకు ప్రత్యేక కిట్లు పంపిణీ.

మౌలిక సదుపాయాలతో పాటు, ఫౌండేషన్ విద్యార్థుల కోసం ప్లేట్లు, గ్లాసులు బహూకరించింది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా ప్లేట్లు, కొత్త పలకలను అందించారు. ముఖ్యంగా, 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న బాలికల ఆరోగ్య అవసరాల నిమిత్తం వారికి శానిటరీ నాప్‌కిన్స్ కిట్‌లను పంపిణీ చేశారు.

విద్య, ఆరోగ్య సేవకు నిరంతర కృషి: జైపాల్ రెడ్డి.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘జయన్న ఫౌండేషన్’ ఛైర్మన్ గుడిపాటి సరిత- జైపాల్ రెడ్డి తమ సేవా దృక్పథాన్ని వెల్లడించారు. విద్య, ఆరోగ్య అభివృద్ధికి తమ సహాయాన్ని నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. పిల్లలకు సౌకర్యాలు కల్పించడం తమకు ‘బిరియాని తిన్నంత’ సంతోషాన్ని ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.

వైద్య సహాయానికి భరోసా.

గతంలో దాదాపు 1500 మంది గ్రామ ప్రజలకు హైదరాబాద్‌లోని శంకర కంటి వైద్యశాల ద్వారా ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్లు, లెన్సులు అమర్చిన విషయాన్ని జైపాల్ రెడ్డి గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా గాంధీ వైద్యశాల వంటి చోట్ల ఎలాంటి వైద్య సహాయం అవసరమైనా తమ సొంత ఖర్చులతో చేయిస్తానని హామీ ఇచ్చారు. సింగపూర్ గ్రామ ప్రజల కోసం ప్రత్యేకంగా అంబులెన్స్‌ను ఏర్పాటు చేసినట్లు, ప్రమాదాల సమయంలో హైదరాబాద్ వరకు ఉచితంగా తరలించే సౌకర్యం కల్పిస్తున్నామని ఆయన ప్రకటించారు. ప్రజలు తమ ఆరోగ్య సమస్యలను తెలియజేస్తే వెంటనే స్పందించి సహాయం చేస్తామని ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు కాసం రఘుపతి రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ బెల్లి రాజయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ ఇమ్మడి దయాకర్, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !