ప్రముఖ సామాజికవేత్త సబ్బని వెంకట్‌ ‘కెరీర్ కన్సల్ట్జ్’ సందర్శన కరీంనగర్, హుజూరాబాద్ అభివృద్ధి, యువత ఉపాధిపై కీలక చర్చ

bahubalamtv Reporter
bahubalamtv.in

ప్రముఖ సామాజికవేత్త సబ్బని వెంకట్‌ ‘కెరీర్ కన్సల్ట్జ్’ సందర్శన కరీంనగర్, హుజూరాబాద్ అభివృద్ధి, యువత ఉపాధిపై కీలక చర్చ

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ అక్టోబర్ 31 :ప్రముఖ సామాజికవేత్త, మల్టీ నేషనల్ ఐటీ కంపెనీ 'జెన్‌ప్యాక్ట్' గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్, శుక్రవారం 'కెరీర్ కన్సల్ట్జ్' సంస్థను సందర్శించారు. కరీంనగర్ జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు దివంగత ఎం. సత్యనారాయణ రావు (ఎంఎస్‌ఆర్) మనవడు, 'కెరీర్ కన్సల్ట్జ్' ఫౌండర్ మరియు సీఈవో మేనేని రోహిత్ రావు ప్రత్యేక ఆహ్వానం మేరకు వెంకట్ ఈ సంస్థను సందర్శించడం జరిగింది.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న 'కెరీర్ కన్సల్ట్జ్' కార్యాలయాన్ని సందర్శించిన సబ్బని వెంకట్, రోహిత్ రావు అందించిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. అనంతరం వీరిద్దరూ సుదీర్ఘంగా సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో పలు కీలక రాజకీయ, వ్యక్తిగత అంశాలపై చర్చ జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రధానంగా, దేశంలో యువతకు ఉపాధి అవకాశాల కల్పన మరియు వారికి సరైన మార్గనిర్దేశం చేయడంపై కూలంకషంగా చర్చించారు. యువత నైపుణ్యాలను పెంచి, వారికి బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు పొందేందుకు దోహదపడే అంశాలపై ఇరువురు దృష్టి సారించారు.
అంతేకాకుండా, కరీంనగర్ మరియు హుజూరాబాద్ నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన సమగ్ర ప్రణాళికలపై కీలక విశ్లేషణ జరిగింది. స్థానిక యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడానికి తీసుకోవాల్సిన చర్యలు, అలాగే యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో ప్రస్తుత నాయకుల పాత్ర గురించి లోతైన చర్చ జరిగినట్టు తెలిసింది. కరీంనగర్ సహా హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించిన సమగ్ర అభివృద్ధిపై సబ్బని వెంకట్ ఇప్పటికే పలు సందర్భాల్లో తన ఆలోచనలను వ్యక్తం చేస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో, ఈ ప్రాంతాల అభివృద్ధికి తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై మరింత దృష్టి సారించినట్లు సమాచారం.
తమ ఆహ్వానాన్ని మన్నించి కంపెనీని సందర్శించినందుకు గాను, రోహిత్ రావు సబ్బని వెంకట్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్శన సమయంలో సబ్బని వెంకట్‌తో పాటు ఆయన టీమ్ సభ్యులు కూడా ఉన్నారు. ఈ సమావేశం కరీంనగర్, హుజూరాబాద్ ప్రాంతాల యువత భవిష్యత్తు, అభివృద్ధికి సంబంధించిన అంశాలకు కొత్త ఊపునిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ అక్టోబర్ 31 :ప్రముఖ సామాజికవేత్త, మల్టీ నేషనల్ ఐటీ కంపెనీ ‘జెన్‌ప్యాక్ట్’ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్, శుక్రవారం ‘కెరీర్ కన్సల్ట్జ్’ సంస్థను సందర్శించారు. కరీంనగర్ జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు దివంగత ఎం. సత్యనారాయణ రావు (ఎంఎస్‌ఆర్) మనవడు, ‘కెరీర్ కన్సల్ట్జ్’ ఫౌండర్ మరియు సీఈవో మేనేని రోహిత్ రావు ప్రత్యేక ఆహ్వానం మేరకు వెంకట్ ఈ సంస్థను సందర్శించడం జరిగింది.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ‘కెరీర్ కన్సల్ట్జ్’ కార్యాలయాన్ని సందర్శించిన సబ్బని వెంకట్, రోహిత్ రావు అందించిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. అనంతరం వీరిద్దరూ సుదీర్ఘంగా సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో పలు కీలక రాజకీయ, వ్యక్తిగత అంశాలపై చర్చ జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రధానంగా, దేశంలో యువతకు ఉపాధి అవకాశాల కల్పన మరియు వారికి సరైన మార్గనిర్దేశం చేయడంపై కూలంకషంగా చర్చించారు. యువత నైపుణ్యాలను పెంచి, వారికి బహుళజాతి సంస్థల్లో ఉద్యోగాలు పొందేందుకు దోహదపడే అంశాలపై ఇరువురు దృష్టి సారించారు.
అంతేకాకుండా, కరీంనగర్ మరియు హుజూరాబాద్ నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన సమగ్ర ప్రణాళికలపై కీలక విశ్లేషణ జరిగింది. స్థానిక యువత రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడానికి తీసుకోవాల్సిన చర్యలు, అలాగే యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో ప్రస్తుత నాయకుల పాత్ర గురించి లోతైన చర్చ జరిగినట్టు తెలిసింది. కరీంనగర్ సహా హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు సంబంధించిన సమగ్ర అభివృద్ధిపై సబ్బని వెంకట్ ఇప్పటికే పలు సందర్భాల్లో తన ఆలోచనలను వ్యక్తం చేస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో, ఈ ప్రాంతాల అభివృద్ధికి తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై మరింత దృష్టి సారించినట్లు సమాచారం.
తమ ఆహ్వానాన్ని మన్నించి కంపెనీని సందర్శించినందుకు గాను, రోహిత్ రావు సబ్బని వెంకట్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్శన సమయంలో సబ్బని వెంకట్‌తో పాటు ఆయన టీమ్ సభ్యులు కూడా ఉన్నారు. ఈ సమావేశం కరీంనగర్, హుజూరాబాద్ ప్రాంతాల యువత భవిష్యత్తు, అభివృద్ధికి సంబంధించిన అంశాలకు కొత్త ఊపునిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !