నిరుపేదలకు అండ…జయన్న సేవ గుణం.. సొంత ఖర్చులతో నిరుపేదలకు వైద్యం.. జయన్న ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి

bahubalamtv Reporter
bahubalamtv.in

నిరుపేదలకు అండ…జయన్న సేవ గుణం.. సొంత ఖర్చులతో నిరుపేదలకు వైద్యం.. జయన్న ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ సెప్టెంబర్ 1: నిరుపేదలకు అండగా నిలవడంలో తన సేవా గుణాన్ని చాటుకున్నారు జయన్న ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి. స్వంత ఖర్చులతో పలువురు పేదలకు వైద్య సాయం అందిస్తూ ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు.
తాజాగా, హుజూరాబాద్ మండలం సింగాపూర్ గ్రామానికి చెందిన బుర్ర భాగ్యమ్మ అనే మహిళ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే జయన్న ఫౌండేషన్ స్పందించింది. ఫౌండేషన్ అంబులెన్స్‌లో భాగ్యమ్మను హుజూరాబాద్‌లోని ఒక ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జమ్మికుంటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి, ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి వైద్య ఖర్చుల బిల్లు తగ్గించారు. అంతేకాకుండా, చికిత్సకు అవసరమైన ఖర్చులను కూడా ఫౌండేషన్ తరపున అందజేశారు. ఈ రోజు భాగ్యమ్మను పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా, సిర్సపల్లి గ్రామానికి చెందిన తునికి రాజయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆయనను పరామర్శించి, వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. నిరుపేదలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న శ్రీమతి గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి సేవలను సింగాపూర్, సిర్సపల్లి గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు. ఆమె సేవా కార్యక్రమాలు పలువురికి స్ఫూర్తినిస్తున్నాయని పేర్కొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !