13వ వార్డు,అంబేద్కర్ యూత్ అసోసియేషన్ నూతన కమిటీకి ఘన సన్మానం.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ జూలై 28: హుజురాబాద్ మున్సిపాలిటీ, 13వ వార్డు, ఇందిరానగర్ కాలనీలో అంబేద్కర్ యూత్ అసోసియేషన్ నూతన కమిటీకి స్థానిక నాయకులు, గ్రామ పెద్దల సమక్షంలో ఘనంగా సన్మానం జరిగింది.
తాజాగా జరిగిన నియామకాలలో అంబేద్కర్ యూత్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా మోరె ఉపేందర్, ప్రధాన కార్యదర్శిగా కుక్కమూడి తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారి నియామకాన్ని పురస్కరించుకొని ఇందిరానగర్ కాలనీలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సన్మాన కార్యక్రమానికి హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత ముఖ్య అతిథిగా హాజరై, నూతన అధ్యక్ష, కార్యదర్శులను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యువత సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహంకాళి కొమురయ్య, కొండ్ర మల్లయ్య, కొలుగూరి బిక్షపతి, మోర్ మహేష్, కొలుగూరి సమ్మయ్య, కొలుగూరి శ్రీను, మరియు వెలిశాల నారాయణతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన మోరె ఉపేందర్, కుక్కమూడి తిరుపతిలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, వారి కార్యకలాపాలకు అన్ని విధాలా సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు.
అలాగే, యూత్ సభ్యులైన అరవింద్, నాగరాజు, సాగర్, గరిగె శివ, మోర్ కృష్ణ, హీరా సింగ్, బచన్ సింగ్, జీత్ సింగ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని, నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందిరానగర్ కాలనీ అభివృద్ధికి, యువత సంక్షేమానికి నూతన కమిటీ కృషి చేయాలని ఆకాంక్షించారు. .





Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..