DPO నిర్లక్ష్యంపై టీజేఎస్‌, సీపీఐ నిరసన: ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్..

బాహు బలంన్యూస్ శంకరపట్నం, జులై 22: ప్రభుత్వ భూముల ఆక్రమణలపై జిల్లా పంచాయతీ అధికారి (DPO) నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తెలంగాణ జన సమితి (టీజేఎస్‌), సీపీఐ పార్టీలు సంయుక్తంగా శంకరపట్నం మండలం అంబేద్కర్ కూడలి వద్ద DPO దిష్టిబొమ్మను దహనం చేశాయి. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులకు లేదా అని టీజేఎస్‌ జిల్లా అధ్యక్షులు మోరె గణేష్ సూటిగా ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో టీజేఎస్‌ మండల పార్టీ అధ్యక్షులు నెలవేణి రమేష్‌తో పాటు, సీపీఐ మండల కార్యదర్శి, జిల్లా కార్యవర్గ సభ్యులు పిట్టల సమ్మయ్య హాజరయ్యారు. మొలంగూరు గ్రామ శివారులోని సర్వే నంబర్ 703లో గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమణదారులు కబ్జా చేసి, అందులో అక్రమంగా రేకుల షెడ్లు, కొట్టములు నిర్మించారని నాయకులు ఆరోపించారు.
దాదాపు ఎనిమిది నెలలుగా టీజేఎస్‌, ఇతర సంఘాలు ఈ ఆక్రమణలపై పోరాటాలు, ఉద్యమాలు, నిరసనలు, నిరాహార దీక్షలు, ముట్టడి కార్యక్రమాలు నిర్వహించాయి. దీనికి స్పందించిన జిల్లా కలెక్టర్, DPO, ఎమ్మార్వోలను పూర్తి విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఎమ్మార్వో భౌతికంగా తనిఖీ చేసి, భూమిని పరిశీలించి హద్దులను గుర్తించారు. అయితే, జిల్లా పంచాయతీ రాజ్ శాఖ అధికారి దాదాపు 20 రోజులుగా స్పందించకుండా కాలయాపన చేస్తూ నిర్లక్ష్యం వహించారని నాయకులు మండిపడ్డారు.
DPO నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ దిష్టిబొమ్మ దహనం చేసిన అనంతరం నాయకులు మాట్లాడుతూ, అధికారి ఇప్పటికీ స్పందించకపోతే రానున్న రోజుల్లో అన్ని పార్టీలు, సంఘాలను కలుపుకొని నిరుపేదల కోసం 100 గుడిసెలు వేసి ఇప్పిస్తామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి అరకెళ్ల స్రవంతి, జిల్లా ప్రధాన కార్యదర్శి మావునూరు గణేష్, యువజన సమితి జిల్లా అధ్యక్షులు అరికెళ్ల భాను, సీపీఐ నాయకులు గోదారి లక్ష్మణ్, పొనగంటి శ్రీనివాస్, రేగుల కుమార్, టీజేఎస్‌ జిల్లా నాయకులు చిట్యాల భాను, ములుగు శ్రీనివాస్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !