కోతులు, కుక్కల సమస్యపై స్పందించండి: హుజురాబాద్ కమిషనర్‌ను కోరిన బీఆర్ఎస్ నేత ప్రభావతిరెడ్డి

bahubalamtv Reporter
bahubalamtv.in

కోతులు, కుక్కల సమస్యపై స్పందించండి: హుజురాబాద్ కమిషనర్‌ను కోరిన బీఆర్ఎస్ నేత ప్రభావతిరెడ్డి

బాహు బలంన్యూస్ హుజురాబాద్, జూలై 15 : హుజురాబాద్ పట్టణంలో కోతులు, కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, ఇవి ప్రజలపై దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయని, కొన్నిచోట్ల మరణాలకు కూడా కారణమవుతున్నాయని బీఆర్ఎస్ మహిళా సీనియర్ నాయకురాలు పూసల ప్రభావతి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తక్షణమే స్పందించి ప్రజలను రక్షించాలని ఆమె ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
ప్రభావతి రెడ్డి మాట్లాడుతూ, పాఠశాలలకు వెళ్లే పిల్లలు, ఇంట్లో ఉండే మహిళలపై కోతులు దాడి చేసి భయాందోళనలకు గురిచేస్తున్నాయని తెలిపారు. ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను పాడుచేయడం, వస్తువులను ఎత్తుకుపోవడం, వాటిని తరిమే ప్రయత్నం చేస్తే మనుషులపై దాడి చేయడం వంటివి నిత్యకృత్యంగా మారాయని ఆమె వివరించారు. ఈ దాడుల వల్ల చాలామంది గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, అయినా మున్సిపల్ కమిషనర్ పట్టించుకోకపోవడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు.
గతంలో మున్సిపల్ పాలకవర్గం ఉన్నప్పుడు రెండు, మూడు సార్లు కోతులను పట్టి ఇతర ప్రాంతాల్లో, అడవుల్లో విడిచిపెట్టిన సంఘటనలు ఉన్నాయని గుర్తుచేశారు. అయితే పాలకవర్గం సమయం ముగిసినప్పటి నుంచి మున్సిపల్ కమిషనర్, సిబ్బంది ఈ సమస్యపై ఎటువంటి చర్యలూ చేపట్టలేదని ప్రభావతి రెడ్డి విమర్శించారు.
ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, హుజురాబాద్ ఆర్డీవోలు వెంటనే దృష్టి సారించి, హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ తక్షణమే కోతులను పట్టణం నుంచి తరిమేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి
కోతులు, కుక్కల సమస్యతో పాటు పట్టణంలోని పలు వాడల్లో అంతర్గత రహదారులు చెత్తాచెదారంతో నిండిపోయి అపరిశుభ్రంగా ఉన్నాయని ప్రభావతి రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి, రోడ్లపై ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేయాలని ఆమె కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !