క్యూ న్యూస్, తీన్మార్ మల్లన్నపై దాడి : సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి – రాజ్‌కుమార్ కురుమ డిమాండ్.

bahubalamtv Reporter
bahubalamtv.in

క్యూ న్యూస్, తీన్మార్ మల్లన్నపై దాడి : సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి – రాజ్‌కుమార్ కురుమ డిమాండ్.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, జూలై 13 న్యూస్):పీర్జాదిగూడలోని క్యూ న్యూస్ కార్యాలయంపై, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ఆది వారం జరిగిన దాడిని హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ రాజ్‌కుమార్ కురుమ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడులు బాధాకరమని, వీటిని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆయన అన్నారు. ప్రజల పక్షాన నిలబడే క్యూ న్యూస్ ఛానెల్‌కు అందరూ అండగా ఉండాలని తీన్మార్ మల్లన్న టీం హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ రాజ్‌కుమార్ కురుమ కోరారు.
ఈ దాడిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హోం శాఖ మంత్రి తక్షణమే స్పందించి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు అండగా నిలవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని రాజ్‌కుమార్ కురుమ స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి జీవితాంతం జైల్లో బంధించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ఈ దాడికి ప్రేరేపించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలని రాజ్‌కుమార్ కురుమ డిమాండ్ చేశారు.
ఈ దాడి ఘటనలో క్యూ న్యూస్‌కు తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన బాధితులు కూడా గాయపడినట్లు తెలిసిందని, గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించి, వారిని పరామర్శించాలని రాజ్‌కుమార్ కురుమ ప్రభుత్వాన్ని కోరారు. ఇకముందు రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ రాజ్‌కుమార్ కురుమ డిమాండ్ చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !