పర్యావరణ పరిరక్షణ: విద్యార్థులకు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ పిలుపు.

bahubalamtv Reporter
bahubalamtv.in

పర్యావరణ పరిరక్షణ: విద్యార్థులకు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ పిలుపు.

బాహు బలంన్యూస్ హుజురాబాద్, జూలై 11:
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య గారు ఉద్ఘాటించారు. స్థానిక విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ స్కూల్ నిర్వహించిన "పర్యావరణ పరిరక్షణ - మన బాధ్యత" అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి తమ పరిసరాలను, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దీని ద్వారా అంటువ్యాధులు ప్రబలకుండా ఆరోగ్యంగా జీవించవచ్చని తెలిపారు. తడి, పొడి చెత్తను వేరుచేసి, గ్రామాలలో లేదా మున్సిపల్ పరిధిలోని చెత్త సేకరణ కార్మికులకు తప్పనిసరిగా అందజేయాలని ఆయన కోరారు.
పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ యాదవ్ మాట్లాడుతూ, పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు తమ వంతుగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులలో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించడానికి తాము కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
గతంలో జరిగిన స్వచ్ఛ హుజురాబాద్ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ పాఠశాల విద్యార్థులను మున్సిపల్ కమిషనర్ ఈ సందర్భంగా అభినందించి, ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్యతో పాటు పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్, డైరెక్టర్ తిరుపతి యాదవ్, ప్రిన్సిపాల్ సౌమ్య, మున్సిపల్ మేనేజర్ భూపతి రెడ్డి, ఉపాధ్యాయ బృందం, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజురాబాద్, జూలై 11:
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య గారు ఉద్ఘాటించారు. స్థానిక విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ స్కూల్ నిర్వహించిన “పర్యావరణ పరిరక్షణ – మన బాధ్యత” అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి తమ పరిసరాలను, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దీని ద్వారా అంటువ్యాధులు ప్రబలకుండా ఆరోగ్యంగా జీవించవచ్చని తెలిపారు. తడి, పొడి చెత్తను వేరుచేసి, గ్రామాలలో లేదా మున్సిపల్ పరిధిలోని చెత్త సేకరణ కార్మికులకు తప్పనిసరిగా అందజేయాలని ఆయన కోరారు.
పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ యాదవ్ మాట్లాడుతూ, పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు తమ వంతుగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులలో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించడానికి తాము కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
గతంలో జరిగిన స్వచ్ఛ హుజురాబాద్ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ పాఠశాల విద్యార్థులను మున్సిపల్ కమిషనర్ ఈ సందర్భంగా అభినందించి, ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్యతో పాటు పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్, డైరెక్టర్ తిరుపతి యాదవ్, ప్రిన్సిపాల్ సౌమ్య, మున్సిపల్ మేనేజర్ భూపతి రెడ్డి, ఉపాధ్యాయ బృందం, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !