తహసిల్దార్ కార్యాలయం ముట్టడికి పిలుపు: మోరె గణేష్ హెచ్చరిక

బాహు బలంన్యూస్ కేశవపట్నం, జులై 10 : మోలంగూరు గ్రామంలోని సర్వే నెంబర్ 703లో ప్రభుత్వ భూముల ఆక్రమణ, నిరుపేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులో జాప్యంపై తెలంగాణ జన సమితి (టీజేఎస్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయమై ఈ నెల 18న తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని టీజేఎస్ జిల్లా అధ్యక్షులు మోరె గణేష్ హెచ్చరించారు. ఈ ముట్టడిలో అన్ని రాజకీయ పార్టీలు, యువజన, ప్రజా సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాలు పాల్గొనాలని ఆయన పిలుపు నిచ్చారు.
మోరె గణేష్ మాట్లాడుతూ, ఎంఆర్ఓ, డీపీఓలపై పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవా లని జిల్లా కలెక్టర్ ఆదేశించినప్పటికీ రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సర్వే నెంబర్ 703లోని ఆక్రమిత ప్రభుత్వ భూమిని గుర్తించి హద్దురాళ్లను ఏర్పాటు చేసినప్పటికీ, హద్దురాళ్ల లోపల కొందరు భూములను ఆక్రమించి అక్రమంగా రేకుల షెడ్లు, కొట్టాలను నిర్మించారని ఆయన తెలిపారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన నిరుపేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాల కింద ప్రతి కుటుంబానికి రెండు గుంటల భూమిని కేటాయించి, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని మోరె గణేష్ గుర్తు చేశారు. అయితే, మిగతా ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని, కేటాయించిన ఇళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్, అనుమతులను పరిశీలించి ఆక్రమణలను తొలగించాలని పలుమార్లు ధర్నాలు, అరెస్టులు, నిరాహార దీక్షలు, నిరసనల ద్వారా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు.
జిల్లా కలెక్టర్ పలుమార్లు ఆదేశాలు జారీ చేసినా రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంపై నిరసనగా ఈ ముట్టడిని నిర్వహిస్తున్నామని మోరె గణేష్ స్పష్టం చేశారు. గూడు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించి, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి పార్టీ నాయకులు కోరపెల్లి శివప్రసాద్, గాజుల శ్యామ్, మోరె శ్రీకాంత్, దాసారపు శివ స్వామి, మోరె వంశీ, కోరపల్లి శివ సాయి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..