రైతు భరోసా. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి – వేముల పుష్పలత..

bahubalamtv Reporter
bahubalamtv.in

రైతు భరోసా. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి – వేముల పుష్పలత..

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, జూన్ 25: కాంగ్రెస్ పార్టీ మరోసారి రైతుల పక్షపాతి అని రుజువు చేసుకుందని, రైతు భరోసా పథకం రైతుల పాలిట పండుగైందని హుజూరాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వేముల పుష్పలత అన్నారు. గతంలో "వరి వేస్తే ఉరి" అనే పరిస్థితి ఉండేదని, కానీ నేడు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ "వ్యవసాయం దండగ కాదు పండగ" అని నిరూపించిందని ఆమె పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు సంవత్సరానికి ఎకరానికి 12,000 చొప్పున రైతు భరోసా పథకం కింద అన్ని వ్యవసాయ భూములకు అందజేస్తున్నారని పుష్పలత తెలిపారు. ఈ పథకంలో భాగంగా తొమ్మిది రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని, ఇది రైతుల కళ్లల్లో ఆనందం నింపి పండుగ వాతావరణాన్ని సృష్టించిందని ఆమె అన్నారు. ఇప్పటివరకు 1 కోటి 49 లక్షల 39 వేల 111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆమె వివరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని పుష్పలత చెప్పారు. గతంలో ఎన్నడూ రైతు భరోసా వేసిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. ఇటువంటి పండుగ వాతావరణాన్ని ఏర్పర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్‌ , జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణకు, హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వోడితల ప్రణవ్‌కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, జూన్ 25: కాంగ్రెస్ పార్టీ మరోసారి రైతుల పక్షపాతి అని రుజువు చేసుకుందని, రైతు భరోసా పథకం రైతుల పాలిట పండుగైందని హుజూరాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వేముల పుష్పలత అన్నారు. గతంలో “వరి వేస్తే ఉరి” అనే పరిస్థితి ఉండేదని, కానీ నేడు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ “వ్యవసాయం దండగ కాదు పండగ” అని నిరూపించిందని ఆమె పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు సంవత్సరానికి ఎకరానికి 12,000 చొప్పున రైతు భరోసా పథకం కింద అన్ని వ్యవసాయ భూములకు అందజేస్తున్నారని పుష్పలత తెలిపారు. ఈ పథకంలో భాగంగా తొమ్మిది రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని, ఇది రైతుల కళ్లల్లో ఆనందం నింపి పండుగ వాతావరణాన్ని సృష్టించిందని ఆమె అన్నారు. ఇప్పటివరకు 1 కోటి 49 లక్షల 39 వేల 111 ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆమె వివరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని పుష్పలత చెప్పారు. గతంలో ఎన్నడూ రైతు భరోసా వేసిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. ఇటువంటి పండుగ వాతావరణాన్ని ఏర్పర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్‌ , జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణకు, హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వోడితల ప్రణవ్‌కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !