ప్రజా పాలన దరఖాస్తులపై జేడీఎస్ విమర్శలు: వాటి భవితవ్యం ఏమిటి? జనతాదళ్ (సెక్యులర్) పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి.

bahubalamtv Reporter
bahubalamtv.in

ప్రజా పాలన దరఖాస్తులపై జేడీఎస్ విమర్శలు: వాటి భవితవ్యం ఏమిటి? జనతాదళ్ (సెక్యులర్) పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ జూన్ 11: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'ప్రజా పాలన' కార్యక్రమంపై జనతాదళ్ (సెక్యులర్) పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ తర్వాత వాటిని కంప్యూటరీకర ణ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.
బుధవారం పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం మాట నమ్మి దరఖాస్తు చేసుకున్న వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాసు వడ్లూరి అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీల్లో కంప్యూటరీకరణ జరగకపోవడంతో కొత్త రేషన్ కార్డులు పొందడం, వాటిలో మార్పులు చేర్పులు చేయించుకోవడం సాధ్యం కావడం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రజల విలువైన సమయాన్ని ప్రభుత్వం వృథా చేసిందని, దరఖాస్తులు స్వీకరించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు.
మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ప్రయోజనం చేకూరుతోందని, ప్రజా పాలన ద్వారా సమర్పించిన దరఖాస్తులు పనికిరాకుండా పోయాయని వడ్లూరి నిప్పులు చెరిగారు. ప్రజా పాలన దరఖాస్తుదారుల అప్లికేషన్లను తక్షణమే కంప్యూటరీకరణ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజురాబాద్ జూన్ 11: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ప్రజా పాలన’ కార్యక్రమంపై జనతాదళ్ (సెక్యులర్) పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ తర్వాత వాటిని కంప్యూటరీకర ణ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.
బుధవారం పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం మాట నమ్మి దరఖాస్తు చేసుకున్న వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాసు వడ్లూరి అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీల్లో కంప్యూటరీకరణ జరగకపోవడంతో కొత్త రేషన్ కార్డులు పొందడం, వాటిలో మార్పులు చేర్పులు చేయించుకోవడం సాధ్యం కావడం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రజల విలువైన సమయాన్ని ప్రభుత్వం వృథా చేసిందని, దరఖాస్తులు స్వీకరించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు.
మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ప్రయోజనం చేకూరుతోందని, ప్రజా పాలన ద్వారా సమర్పించిన దరఖాస్తులు పనికిరాకుండా పోయాయని వడ్లూరి నిప్పులు చెరిగారు. ప్రజా పాలన దరఖాస్తుదారుల అప్లికేషన్లను తక్షణమే కంప్యూటరీకరణ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !