రేవంత్ రెడ్డికి పాలాభిషేకం: బహుజన పక్షపాతిగా కాంగ్రెస్ నిరూపించుకుందని నాయకుల ప్రశంస.

బాహు బలంన్యూస్ కమలాపూర్, జూన్ 10:
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బహుజనులైన బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా నేడు కమలాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ దళిత నాయకుడు పోడేటి బిక్షపతి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వంలో బహుజనవాదం విరజిల్లుతోందని కొనియాడుతూ ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసారు.
ఈ సందర్భంగా కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీరాణి రవీందర్ మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్ర మంత్రిమండలిలో ఉన్నత స్థానాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నప్పటికీ, మంత్రివర్గ విస్తరణలో గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ఎస్సీలు), వాకాటి శ్రీహరి (బీసీ), రామచంద్రనాయక్ (ఎస్టీ) లకు ఉన్నత స్థానాలు కల్పించడం, డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బహుజనుల పార్టీగా, బలహీన వర్గాల పక్షపాతిగా నిరూపించుకుందని పేర్కొన్నారు.
జాతీయస్థాయిలో అగ్రవర్ణాల పక్షపాతి అయిన బీజేపీతో పోరాడుతూ, గతంలో దొరల కుటుంబానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు చేసిన గాయాలకు చికిత్స చేసుకుంటూ, ఎస్సీ, ఎస్టీ, బీసీలను భుజాన ఎత్తుకొని ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజానీకం సంపూర్ణ మద్దతు తెలుపాలని తౌటం ఝాన్సీరాణి రవీందర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు గుండపు చరణ్ పటేల్, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు బాలసాని రమేష్ గౌడ్, మాజీ ఎంపీపీ మాట్ల రమేష్, తడక శ్రీకాంత్, పుల్లూరి శ్రీనివాసరావు, డాక్టర్ మౌటం కుమారస్వామి, మాట్ల రవీందర్, చెరుపల్లి రామచంద్రం, మార్కెట్ డైరెక్టర్లు మిల్కూరి శ్రీనివాస్, అకనపల్లి బిక్షపతి, ఓరుసు తిరుపతి, ఇల్లంతకుంట దేవస్థానం డైరెక్టర్ రెక్కల నారాయణరెడ్డి, పెరుమాండ్ల పరశురాములు, కొండ రమేష్, కొండపాక మనీష్, పల్లె సమ్మిరెడ్డి, పుల్ల శోభన్, మారపల్లి మహేష్, కొండ తిరుపతి, గూడెపు మొగిలయ్య, భాష బోయిన రమేష్, ధర్మల సదానందం, మాట్ల రాజేష్, మారెపల్లి సత్యపాల్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..