ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను చాటిన ప్రచార రథం.. గొడిశాల కాంప్లెక్స్ పరిధిలో విద్యార్థులకు ప్రభుత్వ సౌకర్యాలపై అవగాహన.

బాహు బలంన్యూస్ సైదాపూర్ జూన్ 10,: విద్యా చైతన్య పథం బడిబాటలో భాగంగా, మంగళ వారం రోజు గొడిశాల కాంప్లెక్స్ పరిధిలోని పలు గ్రామాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రచార వాహనం ద్వారా బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎలబోతారం, రాములపల్లి, ఎల్లంపల్లి, గుజ్జులపల్లి, గొడిశాల, నల్లాని రామయ్య పల్లి, అమ్మనగుర్తి, గుండ్లపల్లి, గొల్లపల్లి, బొమ్మకల్, రాయికల్ గ్రామాలలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా, మండల విద్యాధికారి (MEO) కే. శ్రీనివాస్ రెడ్డి, MNO రవీంద్ర చారి, మరియు కాంప్లెక్స్ హెడ్మాస్టర్ సత్యనారాయణ లు తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను, ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న వివిధ సౌకర్యాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో MEO కే. శ్రీనివాస్ రెడ్డి, MNO రవీంద్ర చారి, కాంప్లెక్స్ హెడ్మాస్టర్ సత్యనారాయణ, CRP చక్రపాణి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, AAPC చైర్మన్లు, తల్లిదండ్రులు, మరియు విద్యాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !