ట్రైనింగ్ ఎస్సై భార్గవ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు: దళిత సంఘాల విజయం, తక్షణ అరెస్టుకు డిమాండ్. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ రాష్ట్ర చైర్మన్ తిప్పారత్ సంపత్ .

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి,జూన్ 10,: హుజురాబాద్ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చైర్మన్ తిప్పారత్ సంపత్ మాట్లాడుతూ, బత్తుల మహేందర్‌పై జరిగిన దాడి కేసులో గత నెల నుండి ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, దళిత సంఘాలు చేసిన ఫిర్యాదులను మన్నించి, సోమవారం ఎస్సై భార్గవ్‌తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుల్‌లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం దళిత జాతి విజయంగా అభివర్ణించారు.
ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ, అణగారిన వర్గాలపై దాడి చేస్తే రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం సామాన్యులైనా, పోలీస్ అధికారులైనా ఒకే చట్టం వర్తిస్తుందని ఈ కేసు రుజువు చేసిందని పేర్కొన్నారు. ఈ కేసును పారదర్శకంగా విచారణ జరిపి, వెంటనే నిందితులను అరెస్టు చేయాలని,ఎస్సై భార్గవ్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర పోలీసులపై తమకు అపారమైన గౌరవం, నమ్మకం ఉన్నాయని, ఫ్రెండ్లీ పోలీసులు సమస్యలను త్వరగా పరిష్కరిస్తారని ప్రజలకు నమ్మకం ఉందని సంపత్ అన్నారు. కాబట్టి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన వెంటనే కాలయాపన చేయకుండా, భార్గవ్‌ను, ఇద్దరు కానిస్టేబుల్‌లను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద అరెస్టు చేయాలని కోరారు.
ఇకపై ఇలాంటి సంఘటనలు జరిగితే దళిత జాతి చూస్తూ ఊరుకోదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఏకమయ్యే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. పోలీసులు తమ చట్ట పరిధిలో, ధర్మం ప్రకారం, రాజ్యాంగానికి లోబడి ఉద్యోగాలు చేయాలని విన్నవించారు.
సోమవారం రాత్రి ఎఫ్‌ఐఆర్ నమోదు అయిందని, ఎఫ్‌ఐఆర్ కాపీ కూడా తమకు అందిందని సంపత్ తెలిపారు. ఎస్సై భార్గవ్‌ను వెంటనే సస్పెండ్ చేయకుంటే, దళిత జాతి ఉద్యమాలు చేపట్టే పరిస్థితి వస్తుందని అన్నారు. తాము పోలీసులు తమ పక్షాన ఉంటారని పూర్తి స్థాయిలో నమ్ముతున్నామని, ట్రైనింగ్ ఎస్సై అయిన భార్గవ్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. పోలీసులు తొలగించని పక్షంలో న్యాయపరంగా హైకోర్టులో కేసు వేస్తామని సంపత్ ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ సమావేశంలో బాధితుడు బత్తుల మహేందర్‌తో పాటు ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారం రామచంద్రం, ఎంఎస్‌పి జిల్లా అధ్యక్షులు తునికి వసంత్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చల్లూరి రాహుల్, కాంగ్రెస్ పార్టీ టిపిసిసి లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ రవితేజ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..