వికలాంగులకు రూ. 6,000 పింఛన్ వెంటనే మంజూరు చేయాలి.జనతాదళ్ (సెక్యులర్) పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి డిమాండ్..

bahubalamtv Reporter
bahubalamtv.in

వికలాంగులకు రూ. 6,000 పింఛన్ వెంటనే మంజూరు చేయాలి.జనతాదళ్ (సెక్యులర్) పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి డిమాండ్..

బాహు బలంన్యూస్ హుజురాబాద్ జూన్ 09:కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా వికలాంగులకు రూ. 6,000 పింఛన్‌ను అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తామని ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలని జనతాదళ్ (సెక్యులర్) పార్టీ (జేడీఎస్) రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి డిమాండ్ చేశారు.
సోమవారం రోజు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ, గత ప్రభుత్వం వికలాంగులకు రూ. 4,000 పింఛన్ ఇస్తున్న క్రమంలో, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అదనంగా రూ. 2,000 కలిపి రూ. 6,000 పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చిందని వడ్లూరి గుర్తు చేశారు.
అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల పట్ల చిత్తశుద్ధి కలిగి రూ. 6,000 పింఛన్‌ను వెంటనే మంజూరు చేయాలని వికలాంగుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని వాసు వడ్లూరి డిమాండ్ చేశారు. వికలాంగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన నొక్కి చెప్పారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !