సోనియా గాంధీ విగ్రహాలపై వివాదం: “రూ. 250 కోట్లు అవసరమా?” సామాజికవేత్త కాశెట్టి కుమార్.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్, జూన్ 10:: తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ విగ్రహాల ఏర్పాటు ప్రతిపాదనపై తీవ్ర దుమారం రేగుతోంది. సామాజికవేత్త కాశెట్టి కుమార్ ఈరోజు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో సోనియా గాంధీ విగ్రహానికి రూ. 25 లక్షల చొప్పున మొత్తం రూ. 250 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రైవేట్ టెండర్లు పిలిచే అవకాశం ఉందని వచ్చిన వార్తలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
“ఒకవైపు జీతాలు లేవని, అప్పు పుట్టలేదని ప్రభుత్వం అంటున్నప్పుడు, రూ. 250 కోట్లు ఖర్చు చేసి సోనియా గాంధీ విగ్రహాలు పెట్టడం ఎంతవరకు సమంజసం?” అని కాశెట్టి కుమార్ ప్రశ్నించారు. మిస్ వరల్డ్ పోటీలకు కూడా భారీగా ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు.
“బతికున్నప్పుడు విగ్రహాలా?”
సోనియా గాంధీ బతికి ఉండగానే విగ్రహాలు ఏర్పాటు చేయడంపై కాశెట్టి కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. “బతికి ఉన్నప్పుడు విగ్రహాలు చేయడం సరైన పద్ధతి కాదు. కాంగ్రెస్ నాయకులే చాలామంది సోనియా గాంధీకి బతికున్నప్పుడు విగ్రహాలు చేయవద్దని నాకు ఫోన్ చేసి చెబుతున్నారు,” అని ఆయన తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని ఆలోచించాలని ఆయన కోరారు.
అవసరం లేని ఖర్చు, ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలి.
విగ్రహాల ఏర్పాటుకు బదులుగా ఆ నిధులను పేద పిల్లల స్కూళ్ల నిర్మాణానికి, అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వడానికి ఉపయోగించవచ్చని కాశెట్టి కుమార్ సూచించారు. “నిన్న విదేశాల నుంచి వచ్చిన అందగత్తెల పోటీలకు, వారికి బనాయించడం, చేతులు పిసుక్కోవడం వంటి రిమార్కులు వస్తున్నాయి. ఇవన్నీ చాలా చెడ్డ విషయాలు,” అని ఆయన తీవ్రంగా విమర్శించారు.
సోనియా గాంధీ విగ్రహాలకు బదులుగా సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు, భగత్ సింగ్ వంటి స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని కాశెట్టి కుమార్ డిమాండ్ చేశారు. “వారు మన దేశానికి సేవ చేశారు. అటువంటి విగ్రహాలు పెట్టండి,” అని ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..