పాపులారిటీ కోసం ప్రణవ్ పై తప్పుడు ప్రచారం . చేస్తే సహించేది లేదు మినీ స్టేడియం విషయంలో మినిమం నాలెడ్జి లేకుండా మాట్లాడటం సరికాదు….. హుజారాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి , గాలిబ్ నరేష్

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి జూన్ 03
హుజురాబాద్: స్థానిక హైస్కూల్ మైదానంలో మినీ స్టేడియం నిర్మాణానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాలిబ్ నరేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాపులారిటీ కోసం ప్రణవ్ పై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. మినీ స్టేడియం విషయంలో కనీస అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదన్నారు.
రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి, యూనివర్సిటీ స్థాయి క్రీడాకారులను తయారు చేయడంలో, మిలిటరీ, పోలీస్ ఉద్యోగార్థులకు, పిల్లలకు, పెద్దలకు శారీరక ఫిట్‌నెస్ కోసం, సామాన్య ప్రజల మానసిక ఉల్లాసం కోసం హుజురాబాద్ హైస్కూల్ మైదానం ఎంతో అనుకూలంగా ఉందని గాలిబ్ నరేష్ గుర్తు చేశారు. అయితే, మినీ స్టేడియం పేరుతో గ్రౌండ్‌కు ఉన్న అస్తిత్వాన్ని దెబ్బతీసే చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించారని ఆయన పేర్కొన్నారు.
వాకింగ్ ట్రాక్ కోసం వాకర్స్ అసోసియేషన్ వారు ప్రణవ్ ని కోరగా, ఆయన ప్రత్యేక అభివృద్ధి నిధుల నుండి వాకింగ్ ట్రాక్ మరియు గేట్లను మంజూరు చేయించి నిర్మించుటకు సదరు కాంట్రాక్టర్‌తో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం మనందరికీ గర్వకారణమని నరేష్ అన్నారు. అజ్ఞానంతో, మూర్ఖంగా హోదా గురించి మాట్లాడటం తగదని ఆయన హితవు పలికారు.మినీ స్టేడియంను రాజకీయాలకు వాడుకొని, ఈ మైదానంలో పనులు ఎందుకు చేపట్టారో అందరికీ తెలుసని గాలిబ్ నరేష్ ఆరోపించారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందినవారు సైతం హైస్కూల్ మైదానాన్ని అభివృద్ధి చేయాలని కోరగానే, రాజకీయాలకు అతీతంగా స్పందించి మంజూరు చేయించి అభివృద్ధి చేస్తున్న ప్రణవ్ పై పాపులారిటీ కోసం బురదజల్లే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని గాలిబ్ నరేష్ హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..