విశ్వకర్మ సమాజానికి తెలంగాణ ప్రభుత్వ తీపి కబురు: అభినందన సభకు భారీ ఏర్పాట్లు

bahubalamtv Reporter
bahubalamtv.in

విశ్వకర్మ సమాజానికి తెలంగాణ ప్రభుత్వ తీపి కబురు: అభినందన సభకు భారీ ఏర్పాట్లు

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి మే 24: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న విశ్వకర్మ సమాజానికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. విశ్వకర్మీయుల చిరకాల డిమాండ్ అయిన LT 4వ కేటగిరీలో 10 HP నుండి 25 HP వరకు విద్యుత్ రాయితీని పెంచినందుకు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపింది. ఈ మేరకు మే 28, 2025న ఉదయం 10 గంటలకు హనుమకొండలోని భద్రకాళి దేవాలయం పక్కన ఉన్న కీర్తి గార్డెన్‌లో భారీ అభినందన సభకు ఏర్పాట్లు చేసింది.
ఆచార్య పున్నమాచార్యుల కృషి ఫలించింది అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు, ఆచార్య శ్రీ రాచమల్ల పున్నమాచార్యుల అవిశ్రాంత కృషి ఫలితంగానే తెలంగాణ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని విశ్వకర్మ సంఘం నాయకులు పేర్కొన్నారు. దశాబ్దాలుగా విశ్వకర్మీయులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడిన పున్నమాచార్యుల కృషికి ఇది ఒక గొప్ప విజయమని వారు అన్నారు.ప్రభుత్వానికి కృతజ్ఞతలు, అభినందనలు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గం, అలాగే రాష్ట్ర ఎలక్ట్రిసిటీ అథారిటీ చైర్మన్ (TSNPDCL)కి అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ తరఫున కృత జ్ఞతలు, అభినందనలు తెలియ జేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వకర్మ సోదరు లు, ముఖ్యంగా హుజురాబాద్ పట్టణం, మండలం నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ అభినందన సభను విజయవంతం చేయాలని అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు.
హుజురాబాద్ నాయకుల భాగస్వా మ్యం ఈ సమావేశంలో హుజురా బాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరు విజయ్ కుమార్, మండల అధ్యక్షుడు తాటికొండ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు నందగిరి శ్రీనివా స్, బాణాల వివేకానంద, మాజీ పట్టణ అధ్యక్షులు రాంపల్లి భిక్షపతి, చల్లూరి రఘు, రావుల భిక్షపతి, పంచకోటి సత్యం, సదానందం తదితరులు పాల్గొననున్నారు. విశ్వకర్మ సమాజం ఐక్యతను, ప్రభుత్వానికి తమ మద్దతును చాటుకోవడానికి ఈ సభ ఒక వేదికగా నిలవనుంది.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !