హుజురాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: టిప్పర్ ఢీకొని స్కూటరిస్ట్ దుర్మరణం.

bahubalamtv Reporter
bahubalamtv.in

హుజురాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: టిప్పర్ ఢీకొని స్కూటరిస్ట్ దుర్మరణం.

బాహుబలం న్యూస్ హుజురాబాద్ ప్రతినిధి, మే 21: హుజురాబాద్ పట్టణ నడిబొడ్డున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ స్కూటరిస్ట్ అక్కడికక్కడే మృతి చెందాడు. టిప్పర్ లారీ ఢీకొట్టడంతో తీవ్రగాయాలపాలైన స్కూటరిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు.
స్థానికుల కథనం ప్రకారం, టీఎస్ 02 ఈ వై 16 34 నెంబర్ గల స్కూటీపై వరంగల్ రోడ్డు వైపు హెల్మెట్ ధరించి వెళ్తున్న వ్యక్తిని, వెనకాలే వస్తున్న డిబిఎల్ (నేషనల్ హైవే రోడ్డు పనులు చేస్తున్న కంపెనీ) రోడ్ కంపెనీకి చెందిన టీజీ 08 యు 36 89 నంబర్ గల టిప్పర్ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో లారీ ముందు టైర్లు స్కూటరిస్ట్ నడుముపైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
అంబేద్కర్ నడి చౌరస్తాలో ఈ దుర్ఘటన జరగడంతో పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీపై కేసు నమోదు చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని అక్కడి నుంచి తొలగించి ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !