సైదాపూర్ ఎస్సై భార్గవ్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని హుజురాబాద్ ఏసీపీకి ఫిర్యాదు. టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జ్ తిప్పారపు సంపత్.

bahubalamtv Reporter
bahubalamtv.in

సైదాపూర్ ఎస్సై భార్గవ్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని హుజురాబాద్ ఏసీపీకి ఫిర్యాదు. టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జ్ తిప్పారపు సంపత్.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి, మే 19: సైదాపూర్ ఎస్సై భార్గవ్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పలు దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు సోమ వారం హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. మహేందర్‌పై ఎస్సై భార్గవ్ దాడికి పాల్పడ్డారని వారు ఆరోపించారు.
అనంతరం టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జ్ తిప్పారపు సంపత్ మాట్లాడుతూ, ప్రభుత్వాలు పటిష్టంగా పనిచేస్తున్నప్పటికీ కొందరు పోలీసు అధికారుల తీరు సరిగా లేదని విమర్శించారు. ప్రజలకు పోలీసులు అంటే గౌరవం ఉండాలని, భయం ఉండకూడదని ఆయన అన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని పోలీసులు విస్మరిస్తున్నారని, నియంతల్లా ప్రవర్తిస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎస్సై భార్గవ్, కానిస్టేబుల్ ఆకాశ్‌రెడ్డి, రవికుమార్‌లను ఉద్యోగం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా దళితులకు స్వేచ్ఛ లేకపోవడం బాధాకరమని సంపత్ అన్నారు. దళితులు ఆత్మగౌరవంతో బతకాలంటే ఇలాంటి దాడులు ఎదుర్కోవాల్సిందేనా అని ఆయన ప్రశ్నించారు. దళితులను రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారి తీవ్రంగా కొట్టడంతో మహేందర్ రెండు చెవుల కర్ణబేరులు పగిలాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహేందర్‌కు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని, అతని కుటుంబాన్ని ఎవరు పోషిస్తారని ఆయన నిలదీశారు. ఈ ఘటనపై సీపీ వెంటనే స్పందించి పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధితుడు బత్తుల మహేందర్‌కు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు రుద్రారపు రామచంద్రం మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి మాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధి మారపల్లి శ్రీనివాస్ మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకులు రేణిగుంట్ల సాగర్, మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు తునికి వసంత్ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !