హుజురాబాద్‌లో ఆగని కబ్జాలు – జలవనరులు ప్రమాదంలో, ముంపు భయంతో కాలనీలు.

bahubalamtv Reporter
bahubalamtv.in

హుజురాబాద్‌లో ఆగని కబ్జాలు – జలవనరులు ప్రమాదంలో, ముంపు భయంతో కాలనీలు.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి,మే 19: హుజురాబాద్ పట్టణంలో చెరువులు, కుంటలు, వాగులు, కట్టు కాలువలు గత 15 సంవత్సరాలుగా నిరాటంకంగా కబ్జాకు గురవుతున్నాయని, దీనిపై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ముదిరాజ్ మహాసభ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొలిపాక సమ్మయ్య ముదిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్లక్ష్య వైఖరిపై త్వరలోనే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.
హుజురాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ సమ్మయ్య ముదిరాజ్ పట్టణ నడిబొడ్డున ఉన్న సర్వే నంబర్ 2477లోని గంగోని కుంట వాస్తవ విస్తీర్ణం 12 ఎకరాల 16 గుంటలు కాగా, కబ్జాదారుల కారణంగా ప్రస్తుతం కనీసం 6 ఎకరాలు కూడా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, జమ్మికుంట రోడ్డుకు ఇరువైపులా ఉన్న మోడల్ చెరువు నుండి చంద్రవోని కుంట, గుండ్ల చెరువులకు నీటిని తీసుకెళ్లే కట్టు కాలువలు పూర్తిగా కబ్జాకు గురయ్యాయని తెలిపారు. ఈ విషయమై మున్సిపాలిటీ, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాబోయే వానాకాలంలో జమ్మికుంట రోడ్డులోని పలు కాలనీలు నీట మునగడం ఖాయమని సమ్మయ్య ముదిరాజ్ స్పష్టం చేశారు. నీటి ముంపు సంభవిస్తే, ఫిర్యాదులను పట్టించుకోని సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
హుజురాబాద్ పట్టణంలోని గంగోని కుంట శిఖం భూమి, బట్టోని కుంట, కట్టు కాలువలతో పాటు వరంగల్ రోడ్డును ఆనుకుని ప్రవహించే చిలుకావాగును కూడా ఇరువైపులా కబ్జా చేసి వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని సమ్మయ్య ముదిరాజ్ ఆరోపించారు. గత నెలలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ, హుజురాబాద్ ఎంపీడీవోకు ఆదేశాలు అందినప్పటికీ అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోవడం దారుణమని ఆయన అన్నారు. చిలుకావాగు పక్కన యథేచ్ఛగా జరుగుతున్న నిర్మాణాలే దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
చెరువులు, కుంటలు, వాగులు, కట్టు కాలువల కబ్జాలపై ఫిర్యాదులు చేసినా ప్రభుత్వ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని సమ్మయ్య ముదిరాజ్ ప్రశ్నించారు. వాల్టా చట్టం అమలు పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. ముదిరాజ్ మహాసభ పక్షాన ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేసి ఈ విషయం తేల్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !