హుజురాబాద్ వాకర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కొమురవెల్లి హరిప్రసాద్ ఎన్నిక.

bahubalamtv Reporter
bahubalamtv.in

హుజురాబాద్ వాకర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కొమురవెల్లి హరిప్రసాద్ ఎన్నిక.

బాహు బలంన్యూస్ హుజురాబాద్,మే 18: హుజురాబాద్ వాకర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ వాకర్ కొమురవెల్లి హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక హై స్కూల్ గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన వాకర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకు న్నారు. అనంతరం జరిగిన సమావేశంలో హరిప్రసాద్ ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు కొమురవెల్లి హరిప్రసాద్ మాట్లాడుతూ,తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించినందుకు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వాకర్స్ అసోసియేషన్ అభివృద్ధికి, వాకర్ల సౌకర్యాలకు తనవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. "అందరి సహాయ సహకారాలతోనే మనం ముందుకు సాగగలం. వాకర్లకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా, సభ్యులందరితో చర్చించి, వారి సూచనలు, సలహాలతో పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను" అని ఆయన అన్నారు. హుజురాబాద్ పట్టణంలో వాకింగ్ చేసే వారికి మరింత ఆహ్లాదకరమైన, సురక్షితమైన వాతావరణం కల్పించడానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో పలువురు సీనియర్ వాకర్లు మాట్లాడుతూ, హరిప్రసాద్ అనుభవం, నిబద్ధత అసోసియేషన్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన అధ్యక్షుడి ఎన్నిక పట్ల వాకర్స్ హర్షం వ్యక్తం చేశారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజురాబాద్,మే 18: హుజురాబాద్ వాకర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ వాకర్ కొమురవెల్లి హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక హై స్కూల్ గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన వాకర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకు న్నారు. అనంతరం జరిగిన సమావేశంలో హరిప్రసాద్ ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు కొమురవెల్లి హరిప్రసాద్ మాట్లాడుతూ,తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించినందుకు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వాకర్స్ అసోసియేషన్ అభివృద్ధికి, వాకర్ల సౌకర్యాలకు తనవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. “అందరి సహాయ సహకారాలతోనే మనం ముందుకు సాగగలం. వాకర్లకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా, సభ్యులందరితో చర్చించి, వారి సూచనలు, సలహాలతో పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను” అని ఆయన అన్నారు. హుజురాబాద్ పట్టణంలో వాకింగ్ చేసే వారికి మరింత ఆహ్లాదకరమైన, సురక్షితమైన వాతావరణం కల్పించడానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో పలువురు సీనియర్ వాకర్లు మాట్లాడుతూ, హరిప్రసాద్ అనుభవం, నిబద్ధత అసోసియేషన్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన అధ్యక్షుడి ఎన్నిక పట్ల వాకర్స్ హర్షం వ్యక్తం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !